తెలంగాణ

telangana

'ఐసీసీ టోర్నీల్లో టీమిండియా అలా ఆడాలి'

గత కొన్నేళ్లుగా ఐసీసీ టోర్నీల్లో విఫలమవుతున్నటీమిండియా.. ముంబయి ఇండియన్స్​ తరహాలో ఆడాలని సూచించాడు ఓపెనర్ రోహిత్ శర్మ. మహిళా క్రికెటర్లు స్మతి మంధాన, జెమీమాలతో జరిగిన లైవ్​చాట్​లో ఈ విషయాన్ని వెల్లడించాడు.

By

Published : May 1, 2020, 11:30 AM IST

Published : May 1, 2020, 11:30 AM IST

Team India should play ICC events like Mumbai India plays IPL's
'ఐసీసీలో టీమిండియా, ఎంఐ లాగా ఆడాలి'

ప్రపంచ క్రికెట్​లో ఆధిపత్యం చూపిస్తున్న టీమిండియా.. మూడు ఫార్మాట్లలోనూ అద్భుత ప్రదర్శన కనబరుస్తూ దూసుకెళ్తోంది. టెస్టుల్లో అగ్రస్థానం, వన్డే, టీ20ల్లో రెండులో ప్రస్తుతం కొనసాగుతోంది. అన్ని చోట్లా ఆకట్టుకునే భారత్.. కొన్నేళ్లుగా ఐసీసీ టోర్నీల్లో మాత్రం తుదిమెట్టుపై బోల్తాపడుతోంది. ఈ విషయంపై తాజాగా మాట్లాడాడు ఓపెనర్ రోహిత్ శర్మ. మహిళా క్రికెటర్లు సృతి మంధాన, జెమీమా రోడ్రిగ్జ్​తో జరిగిన లైవ్ చాట్ సెషన్​లో ఈ విషయాలను పంచుకున్నాడు.

"ఐసీసీ టోర్నీల్లో టీమిండియా.. ముంబయి ఇండియన్స్​లా ఆడాలి. ఐపీఎల్​లో మా జట్టు పరాజయాలతో ప్రారంభించినా, విజయాలతో టోర్నీని ముగిస్తుంది. ఇదే తరహాలో భారత్​.. తమ ఆటతీరును మెరుగుపర్చుకోవాలి"

-రోహిత్​ శర్మ, టీమిండియా క్రికెటర్​

2017 ఛాంపియన్స్​ ట్రోఫీలో ఆసాంతం టీమిండియా ఆకట్టుకున్నా, ఫైనల్లో పాకిస్థాన్​పై ఓడిపోయింది. గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్​లోనూ మొదటి నుంచి అద్భుతంగా ఆడి, సెమీస్​లో న్యూజిలాండ్​​ చేతిలో చిత్తయింది.

ఐపీఎల్​ ముంబయి ఇండియన్స్​కు సారథిగా వ్యవహరిస్తున్నాడు రోహిత్​. ఇతడి కెప్టెన్సీలోనే నాలుగుసార్లు విజేతగా నిలిచిందీ జట్టు. అయితే కరోనా నేపథ్యంలో ఈ ఏడాది జరగాల్సిన 13వ సీజన్​ను నిరవధిక వాయిదా వేసింది బీసీసీఐ.

ఇదీ చూడండి : జట్ల భవిష్యత్తుపై ఆన్​లైన్​లో కోచ్​ల చర్చ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details