టీమ్ఇండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్‌లో ఒక సాంకేతిక లోపం ఉందని వెస్టిండీస్ మాజీ ఆటగాడు ఇయాన్ బిషప్ అన్నాడు. అతడు లెగ్‌సైడ్ ఎక్కువగా ఆడుతున్నాడని పేర్కొన్నాడు. గిల్‌ను మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌తో పోల్చాడు. అయితే తన లోపంపై గిల్ అవగాహనతో ఉన్నట్టు కనిపించిందని వెల్లడించాడు.
'గిల్ బ్యాటింగ్‌లో చిన్న సాంకేతిక లోపంపై నేను ఆందోళన చెందుతున్నా. అతడు తరచూ లెగ్‌స్టంప్ నుంచి ఆడుతున్నాడు. లెగ్‌సైడ్ మీదుగా బంతిని ఆడుతున్నాడు. ఇలాంటప్పుడు బౌలర్లు స్టంప్ మీదుగా బంతులు విసురుతూ సవాల్ విసురుతారు. దాంతో బంతి బ్యాటు అంచుకు తగిలి ఔటయ్యే ప్రమాదం ఉంటుంది. గతంలో వీరేంద్ర సెహ్వాగ్ ఇలాగే చేస్తుండేవాడు. అయితే గిల్ అతనిలా మరీ పట్టనట్టు ఆడడు! బ్రిస్బేన్‌లో గిల్ చాలాసార్లు స్టంప్స్ పక్కకు వచ్చాడు. కానీ చేతులు, బ్యాటును దేహానికి దూరంగా ఉంచలేదు. నిజానికి అక్కడే నియంత్రణ తప్పుతారు' అని బిషప్ అన్నాడు.