తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీమ్​ఇండియా కిట్ల స్పాన్సర్​షిప్​ 'ప్యూమా' కేనా?

భారత క్రికెట్​ జట్టు కిట్ల స్పాన్సర్​షిప్​ హక్కులను 'ప్యూమా' సంస్థ దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఐటీటీ పత్రాలను కొనుగోలు చేసినట్లు బీసీసీఐ అధికారులు తెలిపారు. అయితే, 'ప్యూమా'కు ధీటుగా అడిడాస్​ కూడా ఈ విషయంలో ఆసక్తిగా ఉన్నట్లు పేర్కొన్నారు.

Team India kit sponsorship
ప్యూమా

By

Published : Aug 8, 2020, 2:52 PM IST

టీమ్​ఇండియా క్రికెట్​ కిట్ల స్పాన్సర్​షిప్​ హక్కులను పొందేందుకు ప్రముఖ జర్మన్​ స్పోర్ట్స్​ బ్రాండ్ 'ప్యూమా' ఆసక్తి చూపిస్తోంది. అయితే, ప్యూమాకు ధీటుగా అడిడాస్​ కూడా రంగంలోకి దిగే అవకాశాలున్నట్లు బీసీసీఐ అధికారిక వర్గాలు తెలిపాయి. 2016 నుంచి ఇప్పటి వరకు స్పాన్సర్​గా వ్యవహించిన నైక్​.. ఈ సారి బిడ్డింగ్​లో పాల్గొనటంపై ఇంకా స్పష్టత లేదని వెల్లడించారు.

"లక్ష రూపాయల విలువైన ఇన్విటేషన్​ టు టెండర్​(ఐటీటీ) పత్రాన్ని ప్యూమా కొనుగోలు చేసింది. అయితే బిడ్డింగ్​ పత్రాలను చేజిక్కించుకుంటే.. వారికే ఈ స్పాన్సర్​షిప్​ సొంతమని కాదు. ఈ విషయంలో ప్యూమా నమ్మకమైన ఆసక్తిని కనబరుస్తోంది."

-బీసీసీఐ అధికారి

అడిడాస్​ కూడా ఈ విషయంలో ఆసక్తిగా ఉందని.. అయితే, స్పాన్సర్​షిప్​ హక్కుల కోసం బిడ్డింగ్​ వేయడంపై ఇంకా స్పష్టత లేదని పేర్కొన్నారు.

ప్రస్తుత ఆర్థిక సంక్షోభ సమయంలో స్పాన్సర్​షిప్​ విషయంలో తలెత్తిన సమస్యలపై.. ఓ పరిశ్రమకు చెందిన సీనియర్​ అధికారి ఒకరు మాట్లాడుతూ.. "ఈ ఐదేళ్ల ఒప్పందానికి కొత్త స్పాన్సర్​ రూ. 200 కోట్లు చెల్లిస్తే ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ మొత్తం గతంలో నైక్​ చెల్లించిన దానికంటే తక్కువే" అని పేర్కొన్నారు. గతంలో ఒక్కో మ్యాచ్​కు బీసీసీఐ రూ.88లక్షలు మూల ధరను విధించగా.. ఈ సారి రూ.61 లక్షలుగా పేర్కొంది.

కొన్ని సంవత్సరాలుగా ఐపీఎల్​ ద్వారా భారత మార్కెట్​లో ప్యూమా మంచి ప్రజాదరణ పొందింది. ప్రస్తుతం కేఎల్​ రాహుల్​తో పాటు, టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ ఈ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్​గా వ్యవహరిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details