బ్రిస్బేన్లో టీమ్ఇండియా ఉంటున్న హోటల్లో కఠిన క్వారంటైన్ నిబంధనలను విధించారు. ఆ పక్కనే ఉన్న మరో హోటల్లో కరోనా కొత్త స్ట్రెయిన్ వైరస్ కేసు బయటపడింది. దీంతో భారత క్రికెటర్లు, సిబ్బంది మరిన్ని ఆంక్షల నడుమ బసచేస్తున్నారు.
జనవరి 15న ప్రారంభమయ్యే నాలుగో టెస్టు ఆడేందుకు బ్రిస్బేన్ వెళ్లింది టీమ్ఇండియా. కరోనా కేసులు వెలికిచూసిన గ్రాండ్ ఛాన్సెలర్ హోటల్లోని అతిథులను క్వీన్స్లాండ్ ప్రభుత్వం పక్క రాష్ట్రాల్లోని హోటల్లలోకి తరలించింది .