టీమిండియా స్వింగ్ రారాజుగా పేరు తెచ్చుకున్న బౌలర్ ఇర్ఫాన్ పఠాన్. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకూ రిటైర్మెంట్ ప్రకటించాడీ పేసర్. గతంలో శ్రీలంక దిగ్గజ క్రికెటర్ కుమార సంగక్కరతో చోటుచేసుకున్న స్లెడ్జింగ్ విషయంపై ఇర్ఫాన్ పఠాన్ నోరు విప్పాడు. ఆ సందర్భంలో సంగక్కర భార్యను ఉద్దేశించి తాను ఏదో అన్నానన్నాడు. అందువల్లే ఇద్దరి మధ్యా అగ్గి రాజుకుందని తెలిపాడు.
"కుమార సంగక్కరతో జరిగిన ఒక సంఘటన నాకు గుర్తుంది. దిల్లీలో ఆడుతున్న ఆ టెస్టు మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌కు ముందు సెహ్వాగ్‌కు గాయమవడం వల్ల నన్ను ఓపెనింగ్‌కు పంపారు. అప్పుడు మురళీ ధరన్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నప్పటికీ నేను 93 పరుగుల వద్ద కొనసాగుతున్నా. అప్పుడే సంగక్కరకు మ్యాచ్ తమ చేతుల నుంచి జారిపోతుందని అర్థమై ఏదో మాట తూలాడు. ఏదో వ్యక్తిగతంగా దూషించాడు. నేను కూడా అలాగే అన్నాను. అప్పుడతని భార్య గురించి మాట్లాడాను. సంగక్కర మా తల్లి దండ్రుల గురించి అన్నాడు. దీంతో మా ఇద్దరి మధ్య అగ్గిరాజుకుంది".
--ఇర్ఫాన్ పఠాన్, మాజీ క్రికెటర్