తెలంగాణ

telangana

ETV Bharat / sports

కరీబియన్ సముద్రంలో భారత క్రికెటర్ల షికారు - anushka

కరీబియన్ సముద్రంలో సరదాగా షికారుకెళ్లారు టీమిండియా క్రికెటర్లు. కెప్టెన్ విరాట్​ కోహ్లీతో పాటు రాహుల్, అశ్విన్, మయాంక్ సందడి చేశారు. వీరితో పాటు అనుష్క శర్మ ఉంది.

టీమిండియా క్రికెటర్లు

By

Published : Aug 27, 2019, 1:08 PM IST

Updated : Sep 28, 2019, 11:05 AM IST

వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా ఆటగాళ్లు కరీబియన్​ దీవుల్లో సందడి చేస్తున్నారు. ఆంటిగ్వా వేదికగా జరిగిన తొలి టెస్టు విజయాన్ని ఆస్వాదిస్తూ సముద్రంలో బోట్​పై షికారుకెళ్లారు. కెప్టెన్ విరాట్​ కోహ్లీతో పాటు సహచర క్రికెటర్లైన రవిచంద్రన్ అశ్విన్, కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ సరదాగా గడిపారు. వీరితో పాటు అనుష్కశర్మ ఉంది.

ఈ విషయాన్ని అశ్విన్ తన ఇన్ స్టాలో పంచుకున్నాడు. "నడి సముద్రంలో సూర్యరశ్మి పడుతుండగా సహచరులతో సరదాగా గడిపాను" అంటూ పోస్ట్ చేశాడు.

ఆంటిగ్వా వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా 318 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ గెలుపుతో రెండు టెస్టులో సిరీస్​లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ మ్యాచ్​తోనే ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​లో బోణీ కొట్టింది కోహ్లీ సేన​.

ఇది చదవండి: ఈ విజయం అభిమానుల ప్రేమాభిమానాల వల్లే:సింధు

Last Updated : Sep 28, 2019, 11:05 AM IST

ABOUT THE AUTHOR

...view details