తెలంగాణ

telangana

ETV Bharat / sports

దసరా విషెస్ తెలిపిన క్రికెటర్లు - సచిన్ దసరా శుభాకాంక్షలు

విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని టీమ్ఇండియా మాజీలు, క్రికెటర్లు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

Team India Cricketers extend warm wishes on Dussehra
దసరా విషెస్ తెలిపిన క్రికెటర్లు

By

Published : Oct 25, 2020, 1:14 PM IST

Updated : Oct 25, 2020, 1:30 PM IST

నేడు విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని టీమ్‌ఇండియా మాజీలు, ప్రస్తుత ఆటగాళ్లు తమ అభిమానులకు దసరా శుభాకాంక్షలు చెప్పారు. ఎప్పటికైనా చెడుపై మంచే విజయం సాధిస్తుందనడానికి ఈ పండగే ఉదాహరణ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

  • మన ప్రయాణం ఎంత దూరంగా ఉన్నా ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా చివరికి చెడుపై మంచే విజయం సాధిస్తుంది. మనతో పాటు మన చుట్టూ ఉండే ప్రతికూల ప్రభావాలపై విజయం సాధించాలని కోరుతున్నా. - సచిన్‌ తెందూల్కర్
  • ఈ దసరా పండుగ సందర్భంగా మీకూ, మీ కుటుంబసభ్యులకు శుభాకాంక్షలు. హ్యాపీ దసరా. - విరాట్‌ కోహ్లీ
  • ఈ విజయదశమి సందర్భంగా శ్రీరాముడు తన ఇష్టప్రకారం అందరి కోరికలు తీర్చాలి. ప్రేమ, కరుణ, నీతి నిజాయతీ గల ఆ రాముడికి జై. హ్యాపీ దసరా. -వీరేంద్ర సెహ్వాగ్‌
  • ప్రతి ఒక్కరికీ విజయ దశమి శుభాకాంక్షలు. చెడుపై మంచి గెలిచిన ఈ రోజు రాబోయే తరాలకు కూడా స్ఫూర్తిమంత్రంగా నిలవాలి. అలాగే ఈ పండుగ మనందరి జీవితాల్లో సుఖ సంతోషాలు తీసుకురావాలని కోరుతున్నా.- గౌతమ్‌ గంభీర్‌
  • అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. ఎల్లప్పుడూ చెడుపై మంచి విజయం సాధించాలి. ఇది మన చుట్టే కాదు. మనలోనూ జరగాలి. ఈ శుభ సందర్భంగా అందరికీ సుఖ సంతోషాలు కలగాలి. -సురేశ్‌ రైనా
  • ఈ దసరా పండుగ మనందరి జీవితాల్లో అమితమైన ప్రేమతో పాటు మంచిని కూడా తీసుకురావాలి. -వీవీఎస్‌ లక్ష్మణ్
Last Updated : Oct 25, 2020, 1:30 PM IST

ABOUT THE AUTHOR

...view details