టీమ్ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ ఆస్పత్రిలో చేరాడు. ఐదు రోజుల క్రితం కొవిడ్ వచ్చినట్లు వెల్లడించిన మాస్టర్ బ్లాస్టర్.. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రిలో చేరినట్లు ట్విట్టర్ వేదికగా తెలిపాడు.
అయితే తన కుటుంబ సభ్యులెవరికీ పాజిటివ్ రాలేదని సచిన్ తెలిపాడు.
"నా కోసం ప్రార్థిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. వైద్యుల సలహా మేరకు మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రిలో చేరాను. త్వరలోనే క్షేమంగా ఇంటికి తిరిగి వస్తానని ఆశిస్తున్నా. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి."