టీమ్ఇండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి కొవిడ్ టీకా తొలి డోసును తీసుకున్నాడు. 58 ఏళ్ల శాస్త్రి.. అహ్మదాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో వ్యాక్సిన్ వేయించుకున్నాడు.
"కరోనా వ్యాక్సిన్ తొలి డోసును తీసుకున్నాను. మహమ్మారికి వ్యతిరేకంగా భారతదేశాన్ని శక్తిమంతం చేస్తున్న వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలకు ధన్యవాదాలు" అని రవిశాస్త్రి ట్వీట్ చేశాడు.