తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీమ్​ఇండియా తొలి విక్టరీ.. ఆసీస్​పై అద్భుత విజయం - కోహ్లీ వార్తలు

మూడో వన్డేలో అద్భుతమైన విజయం సొంతం చేసుకున్న కోహ్లీసేన.. క్లీన్​స్వీప్​ నుంచి తప్పించుకుంది. ఇదే ఊపును టీ20 సిరీస్​లోనూ కొనసాగించాలని చూస్తోంది.

team india beat australia
టీమ్​ఇండియా తొలి విక్టరీ.. ఆసీస్​పై అద్భుత విజయం

By

Published : Dec 2, 2020, 4:58 PM IST

Updated : Dec 2, 2020, 8:43 PM IST

ఆసీస్​ పర్యటనలో టీమ్​ఇండియాకు తొలి విజయం. కాన్​బెర్రాలో జరిగిన మూడో వన్డేలో ఆసీస్​ను 13 పరుగుల తేడాతో ఓడించింది. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్​లు ఆసీస్ గెలవడం వల్ల సిరీస్​ను 2-1 తేడాతో కంగారూ జట్టు సొంతం చేసుకుంది.

టాస్​ వేస్తున్న ఆస్ట్రేలియా కెప్టెన్​ ఆరోన్​ ఫించ్​

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్​.. ఆచితూచి ఆడింది. దీంతో వరుస విరామాల్లో శిఖర్ ధావన్(16), శుభ్​మన్ గిల్(33), కోహ్లీ(63), శ్రేయస్ అయ్యర్(19), కేఎల్ రాహుల్(5) వికెట్లు కోల్పోయింది. దీంతో కనీసం 250 పరుగులు అయినా చేస్తుందా అని​ అభిమానులు అనుకున్నారు.

హార్దిక్​ పాండ్యా
రవీంద్ర జడేజా

అయితే చివర్లో వచ్చిన హార్దిక్ పాండ్య(92*), రవీంద్ర జడేజా(66*) వీర విహారం చేశారు. చూడచక్కని షాట్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. దీంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో అగర్ 2, హేజిల్​వుడ్, అబాట్, జంపా ఒక్కో వికెట్​ తీశారు.

నటరాజన్​

ఛేదనలో ఆసీస్ బాగానే ఆడినప్పటికీ వరుసగా వికెట్లు పడటం వల్ల 13 పరుగుల తేడాతో గెలుపును దూరం చేసుకుంది. ఫించ్(75), మ్యాక్స్​వెల్(59) ఎక్కువ పరుగులు చేశారు. మిగిలిన వారు నామమాత్రంగానే ఆడారు. భారత బౌలర్లలో శార్దుల్ ఠాకుర్ 3 వికెట్లు తీయగా, నటరాజన్, బుమ్రా తలో 2, కుల్దీప్, జడేజా ఒక్కో వికెట్ పడగొట్టారు.

నటరాజన్​ను మెచ్చుకుంటున్న కెప్టెన్​ కోహ్లీ
ఆనందంలో కోహ్లీసేన

ఇది చదవండి:సచిన్​ను అధిగమించిన కోహ్లీ- వన్డేల్లో సరికొత్త రికార్డు

Last Updated : Dec 2, 2020, 8:43 PM IST

ABOUT THE AUTHOR

...view details