వెస్టిండీస్‌తో జరిగిన ఆఖరి టీ20లో రోహిత్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో(8, 15) నిరాశపరిచిన హిట్‌మ్యాన్.. బుధవారం సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌లో 71 పరుగులు(34 బంతుల్లో; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) బాదాడు. కెరీర్‌లో 19వ టీ20 అర్ధశతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు. మరో ఓపెనర్ రాహుల్‌తో కలిసి మొదటి వికెట్‌కు 135 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. అయితే రోహిత్ శర్మ ఔటైన తర్వాత స్టాండ్స్‌లో ఉన్న భార్య రితిక, కూతురు సమైరాతో మాట్లాడేందుకు ప్రయత్నించాడు.
భార్య రితిక, కూతురు సమైరాతో రోహిత్ టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ నుంచే కుమార్తెతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో అభిమానులు, మీడియా ఫొటోలు తీసేందుకు ఎగబడ్డారు. అప్పుడు తీసిన వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసింది ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబయి ఇండియన్స్. అందులో రోహిత్ ఎవరితో మాట్లాడుతున్నాడో కనిపెట్టండి అని ప్రశ్నించింది. దీనిపై నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు.
400 సిక్సర్ల వీరుడు..
మూడో టీ20లో భారత ఓపెనర్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్లో మిడ్ వికెట్ దిశగా సిక్స్ బాదిన రోహిత్ శర్మ.. అంతర్జాతీయ క్రికెట్‌లో 400 సిక్సర్లు నమోదు చేసిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఇప్పటి వరకూ క్రిస్‌గేల్, అఫ్రిది మాత్రమే ఈ 400 సిక్సర్ల మార్క్‌ను అందుకున్నారు.
సుదీర్ఘ కెరీర్‌లో 218 వన్డేలాడిన రోహిత్ శర్మ 236 సిక్సర్లు, 104 టీ20ల్లో 116 సిక్సర్లు, 32 టెస్టుల్లో 52 సిక్సర్లు నమోదు చేశాడు. భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్ల జాబితాలో రోహిత్ అగ్రస్థానంలో ఉన్నాడు. ధోనీ 359 సిక్సర్లు (538 మ్యాచ్‌లు), సచిన్ తెందూల్కర్ 264 సిక్సర్లు (664 మ్యాచ్‌ల్లో) టాప్ -3లో కొనసాగుతున్నారు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ 398 మ్యాచ్‌ల్లో 206 సిక్సర్లతో ఉన్నాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా... నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండిస్ 8 వికెట్లు కోల్పోయి 173 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా టీమిండియా మూడు టీ20ల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మొదటి మ్యాచ్ చెన్నై వేదికగా ఆదివారం జరగనుంది.