తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఫోజులు ఆపి ప్రాక్టీస్​ చేయ్​​.. కేదార్​కు రోహిత్ సూచన

స్టార్ క్రికెటర్ రోహిత్​శర్మ సహచర ఆటగాడు కేదార్​ జాదవ్​పై ఛలోక్తి విసిరాడు. బ్యాట్​ పట్టుకొని ఉన్న ఫొటోలను జాదవ్​ పోస్టు చేయగా... వాటిపై హిట్​మ్యాన్​ వ్యంగ్యంగా స్పందించాడు. ఈనెల 15 నుంచి వెస్టిండీస్​తో జరిగే వన్డే సిరీస్​ కోసం ప్రాక్టీసు చేయాలని సూచించాడు.

By

Published : Dec 5, 2019, 5:24 PM IST

team india batsmen Rohit Sharma Trolls Kedar Jadhav and said Him To Focus On Batting Instead Of Posing
ఫోజులు ఆపి ప్రాక్టీస్​ చేయ్​​.. కేదార్​కు రోహిత్ సూచన

టీమిండియా క్రికెటర్లు.. సోషల్​ మీడియాలో సహచరులపై అప్పుడప్పుడూ సరదాగా ట్వీట్లు, కామెంట్లు చేస్తుంటారు. తాజాగా భారత ఆల్​రౌండర్​ కేదార్​ జాదవ్​పై ఓపెనర్ రోహిత్​శర్మ.. ఇదే రీతిలోకామెంట్ చేశాడు.

ఇంగ్లాండ్​లో జరిగిన ప్రపంచకప్​లో సరైన ప్రదర్శన చేయలేకపోయాడు జాదవ్. అప్పట్నుంచి ఏ సిరీస్​లోనూ చోటు దక్కించుకోలేకపోయాడు. ఇటీవలే ముగిసిన సయ్యద్​ ముస్తాక్​ అలీ టోర్నీలోనూ నిరాశపర్చాడు.

తాజాగా తన ఇన్​స్టాలో కొన్ని ఫొటోలు పెట్టాడుజాదవ్​. వాటిపై రోహిత్​ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. "ఫోజులు కొట్టడం ఆపి బ్యాటింగ్‌పై దృష్టి పెట్టు" అని కామెంట్‌ చేశాడు. జాదవ్‌ పోస్ట్​కు హిట్​మ్యాన్​ సమాధానం ఇవ్వడం చర్చనీయాంశమైంది. అంతేకాకుండా ఈ పోస్ట్.. ఇన్‌స్టాలో గురువారం మోస్ట్‌ పాపులర్‌గా నిలిచింది.

రోహిత్​ కామెంట్​

వెస్టిండీస్‌తో త్వరలో ఆరంభం కానున్న వన్డే సిరీస్​లో చోటు దక్కించుకున్నాడు కేదార్​ జాదవ్​. ఈనెల 15న చెన్నైలో మొదటి మ్యాచ్​. 18న రెండోది విశాఖపట్నంలో, మూడో మ్యాచ్‌22న కటక్‌లో జరగనున్నాయి.

ఐదేళ్లయినా నిలబెట్టుకోలే

2014లోనే టీమిండియాలో చోటు దక్కించుకున్న ఆల్​రౌండర్​ కేదార్​ జాదవ్​... జాతీయ జట్టులో స్థానం సుస్థిరం చేసుకోలేకపోయాడు. ఈ ఏడాది జరిగిన ప్రపంచకప్​ సహా దేశవాళీ టోర్నీల్లోనూ పెద్దగా రాణించలేదు. వన్డే కెరీర్‌లో ఇప్పటివరకు రెండు సెంచరీలు, 6 అర్థ శతకాలు చేశాడు. 9 టీ20ల్లో 20.33 సగటుతో 122 పరుగులే సాధించాడు.

విండీస్​తో సిరీస్​కు వన్డే జట్టు..

విరాట్​ కోహ్లీ(కెప్టెన్​), రోహిత్​ శర్మ, శిఖర్​ ధావన్​, కేఎల్​ రాహుల్​, రిషబ్​ పంత్​, మనీశ్​ పాండే, శ్రేయస్​ అయ్యర్​, కేదార్​ జాదవ్​, రవీంద్ర జడేజా, శివమ్​ దూబే, యజ్వేంద్ర చాహల్​, కుల్దీప్​ యాదవ్​, మహ్మద్​ షమి, దీపక్​ చాహర్​, భువనేశ్వర్​ కుమార్​.

ABOUT THE AUTHOR

...view details