ఐపీఎల్ తర్వాత ఆస్ట్రేలియాకు పయనమైన టీమ్ఇండియా క్రికెటర్లు.. గురువారం సిడ్నీలో అడుగుపెట్టారు. వీరితో పాటే లీగ్లో పాల్గొన్న ఆసీస్ క్రికెటర్లు స్టీవ్ స్మిత్, వార్నర్ తదితరులు ఉన్నారు. వీరితో పాటు కోహ్లీసేన.. సిడ్నీలోనే 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉండనుంది. అనంతరం నవంబరు 27న జరిగే తొలి వన్డేలో ఆటగాళ్లు పాల్గొననున్నారు.
ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన కోహ్లీసేన - ఆస్ట్రేలియ పర్యటనలో టీమ్ఇండియా
ఆస్ట్రేలియా పర్యటన కోసం టీమ్ఇండియా ఆటగాళ్లు సిడ్నీ చేరుకున్నారు. వీరితో పాటు ఐపీఎల్లో పాల్గొన్న ఆస్ట్రేలియా ఆటగాళ్లు కూడా ఉన్నారు. వీరందరు 14రోజుల పాటు సిడ్నీలోనే క్వారంటైన్లో ఉండనున్నారు.
![ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన కోహ్లీసేన Team India arrives in Sydney for Australia tour](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9525117-966-9525117-1605184231548.jpg)
సిడ్నీ చేరుకున్న టీమ్ఇండియా.. 14 రోజుల క్వారంటైన్
జనవరి 19 వరకు సాగే ఈ పర్యటనలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా.. మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనున్నాయి. పితృత్వ సెలవులు తీసుకున్న కారణంగా చివరి మూడు టెస్టులకు కోహ్లీ దూరం కానున్నాడు.
Last Updated : Nov 12, 2020, 10:30 PM IST