లాక్డౌన్ విరామ సమయంలో తనకు ఇష్టమైన వ్యాపకాలతో సమయాన్ని సరదాగా గడుపుతున్నాడు టీమ్ఇండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా. తాజాగా వంటింట్లో దూరి గరిటె పట్టి.. కొత్త వంటలు నేర్చుకుంటున్నాడీ స్టార్ క్రికెటర్. దీనికి సంబంధించిన ఓ ఫొటోను ఇన్స్టాలో షేర్ చేశాడు హార్దిక్.
ఈ ఆల్రౌండర్ బ్యాట్ పట్టినా.. గరిటె తిప్పినా సూపరే! - హార్దిక్ పాండ్యా లేటెస్ట్ న్యూస్
మైదానంలో బ్యాట్ పట్టి ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించే టీమ్ఇండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా.. ప్రస్తుతం వంటింట్లో గరిటె పట్టాడు. తన కుటుంబ సభ్యులకు వండిపెట్టడానికి తానే ఛెఫ్ అవతారమెత్తాడు. తాను వంట చేస్తున్న చిత్రాన్ని తాజాగా ఇన్స్టాలో పంచుకున్నాడు హార్దిక్.
![ఈ ఆల్రౌండర్ బ్యాట్ పట్టినా.. గరిటె తిప్పినా సూపరే! Team India All Rounder Hardik Pandya turns to Chef](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7726896-thumbnail-3x2-hd.jpg)
ఈ ఆల్రౌండర్ బ్యాట్ పట్టినా.. గరిట తిప్పినా సూపరే!
"మీ చేతికి కొత్తదనాన్ని నేర్పించే ప్రయత్నంలో ఎప్పుడూ ఆలస్యం చేయవద్దు. పాండ్యా ఇంట్లో వంటింటి పనులను చేస్తున్నా. చీజ్ బటర్ మసాలా కోసం స్వైప్ చేయండి" అని ఇన్స్టాలో రాసుకొచ్చాడీ యువ క్రికెటర్.
ఇటీవలే తనకు కాబోయే భార్య నటాషా స్టాంకోవిచ్.. గర్భవతి అనే వార్తను సోషల్మీడియాలో పంచుకున్నాడు హార్దిక్. దుబాయ్లో హార్దిక్.. నటాషాకు తన ప్రేమను వ్యక్త పరచగా, 2020 నూతన సంవత్సర వేడుకలో వీరిద్దరికి నిశ్చితార్థం జరిగింది.