పింక్ టెస్టులో మొతెరా పిచ్ స్పిన్‌కు సహకరిస్తుంది. దీంతో టీ విరామ సమయానికి ఇంగ్లాండ్ జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. క్రీజులో పోప్(1), స్టోక్స్(6) ఉన్నారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ రెండు వికెట్లు తీయగా.. ఇషాంత్, అశ్విన్ తలో వికెట్ పడగొట్టారు.
కష్టాల్లో ఇంగ్లాండ్- 'టీ' విరామానికి 81/4
పింక్ టెస్టులో ఇంగ్లాండ్ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రూట్ సేన టీ విరామ సమయానికి 4 వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. క్రీజులో పోప్, స్టోక్స్ ఉన్నారు. అక్షర్ పటేల్ రెండు వికెట్లు తీయగా.. ఇషాంత్, అశ్విన్ తలో వికెట్ తీశారు.
పింక్ టెస్టు: టీ సమయానికి 81/4తో ఇంగ్లాండ్
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్‌ను వందో టెస్టు ఆడుతున్న ఇషాంత్ శర్మ ఆదిలోనే దెబ్బకొట్టాడు. ఓపెనర్ డామ్ సిబ్లీని స్లిప్‌లో దొరకబుచ్చుకున్నాడు. కాసేపటికే జానీ బెయిర్ స్టోను.. అక్షర్ పటేల్ ఎల్బీగా వెనక్కి పంపాడు. ఇక మూడో వికెట్‌కు 47 పరుగులు జోడించి ప్రమాదకరంగా మారుతున్న రూట్, క్రావ్లే జంటను అశ్విన్ విడదీశాడు. రూట్ వికెట్ల ముందు దొరికిపోయాడు. అర్ధ సెంచరీ చేసి ఊపుమీదున్న జాక్ క్రావ్లేను అక్షర్ పెవిలియన్ పంపాడు.