తెలంగాణ

telangana

ETV Bharat / sports

తడబడి...నిలబడిన భారత్​ - newzealand

ఐదో వన్డేలో 252 పరుగులు చేసిన టీమిండియా. రాయుడు-శంకర్​ జోడి 97 పరగుల కీలక భాగస్వామ్యం, చివర్లో పాండ్యా మెరుపులతో భారత్​ గౌరవప్రదమైన స్కోరు చేసింది.

Breaking News

By

Published : Feb 3, 2019, 12:27 PM IST

HURDLES IN IND BATTING
వెల్లింగ్​టన్​ వేదికగా న్యూజిలాండ్​తో ఆఖరు వన్డేలో 252 పరుగులకు భారత్​ ఆలౌటైంది. టాప్​ ఆర్డర్​ బ్యాట్స్​మెన్​ మరోసారి విఫలమయ్యారు. ఓ దశలో 18 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన టీమిండియాను రాయుడు-విజయ్​ శంకర్​ల జోడీ అదుకుంది. కివీస్​ బౌలర్లను జాగ్రత్తగా అంచనా వేస్తూ ఇద్దరూ నిలకడగా ఆడారు. ఐదో వికెట్​కు 97 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. అర్ధ సెంచరికీ చేరువలో 45 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద విజయ్​ శంకర్​ రనౌట్​గా వెనుదిరిగాడు.

అంబటి రాయుడు 113 బంతుల్లో 8ఫోర్లు, 4సిక్సర్లతో 90 పరుగులు చేసి బాధ్యతాయుత ఇన్నింగ్స్​ ఆడాడు. కేదార్​ జాదవ్ 45 బంతుల్లో 3పోర్లతో 34 పరుగులు చేసి రాయుడుకు సహకారం అందించాడు. చివర్లో హార్దిక్​ పాండ్యా సిక్సర్లతో విరుచుకుపడి 22 బంతుల్లోనే 45 పరుగులు సాధించాడు.

PANDYA MIRACLES

రాయుడు హాఫ్​ సెంచరీ

అంబటి రాయుడు క్రీజులో కుదరుకునే వరకు నెమ్మదిగా ఆడాడు. అ తర్వాత కివీస్​ బౌలర్లను ధీటుగా ఎదుర్కొని అర్ధ సెంచరీ సాధించాడు. అనంతరం బ్యాటింగ్​ జోరు పెంచాడు. తృటిలో శతకం చేజార్చుకున్న రాయుడు హెన్రీ బౌలింగ్​లో మున్రోకు క్యాచ్​ ఇచ్చి నిష్ర్కమించాడు.

RAYUDU@90

మూడు ఓవర్లు-మూడు వికెట్లు

టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న టీమిండియాకు ఓపెనర్లు మంచి ఆరంభం ఇవ్వలేకపోయారు. మొదటి రెండు ఓవర్లలో స్కోరు ఖాతా తెరవలేదు. రెండు పరుగులు చేసిన రోహిత్​ ఐదో ఓవర్లో హెన్రీ బౌలింగ్​లో బౌల్డ్​ అయ్యాడు. ఆ మరుసటి ఓవర్లలోనే ధావన్​(6)ను బౌల్ట్​ ఔట్​ చేశాడు. 7 పరుగులు చేసిన శుబ్​మన్ గిల్​ను​ ఏడో ఓవర్లో హెన్రీ పెవిలియన్​కు చేర్చాడు. దీంతో వరుసగా మూడు ఓవర్లరో మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది టీమిండియా.

NZ BOWLING ATTACK

ఒక్క పరుగుకే ధోని ఔట్​

17 పరుగులకే మూడు వికెట్ల నష్టంతో క్లిష్ట స్థితిలో ఉన్న టీమిండియాను మిస్టర్​ కూల్​ ధోని ఆదుకోలేకపోయాడు. ఒక్క పరుగు చేసిన ధోనీని క్లీన్​ బౌల్డ్​ చేశాడు బౌల్ట్​.

ABOUT THE AUTHOR

...view details