ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మార్క్ టేలర్ కంకషన్ సబ్స్టిట్యూట్పై కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ పద్ధతిని... నిజాయతీగా, బాధ్యతగా ఆటగాడిని రక్షించేందుకు మాత్రమే ఉపయోగించాలని వ్యాఖ్యానించాడు.
కాన్బెర్రా వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మొదటి టీ20 మ్యాచ్లో రవీంద్ర జడేజాకు బదులుగా చాహల్నుకంకషన్ సబ్స్టిట్యూట్చేశారు. దీనిని పలువురు సమర్థించగా మరి కొంతమంది విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టేలర్ పై వ్యాఖ్యలు చేశాడు.
" కంకషన్ సబ్స్టిట్యూట్ పద్ధతిని ఆటగాడిని రక్షించేందుకు మాత్రమే ఉపయోగించాలి. ఆటను కొనసాగించేలా చేసే ఆటగాళ్లన్నా, కోచ్లన్నా నాకు చాలా ఇష్టం. ఆటకు అంతరాయం ఏర్పడకుండా కొన్ని నిబంధనలు ఉంటాయి. అవి నిజాయతీగా పాటించాలి. మరి భారత్ ఈ పద్ధతిని ఎలా ఉపయోగించిందనే దానిపై స్పష్టత అవసరం."