తెలంగాణ

telangana

ETV Bharat / sports

వీరిలో ప్రతిభ ఉన్నా.. దురదృష్టం వెంటాడింది

క్రికెట్​లో టాలెంట్​ ఒక్కటే ఉంటే సరిపోదు. దానికి తోడు కాసింత అదృష్టమూ తోడవ్వాలి. లేదంటే నైపుణ్యం ఉన్నా కనుమరుగైపోక తప్పదు. ఎప్పుడో క్రికెట్​లోకి వచ్చి, దేశవాళీల్లో రాణించినా జాతీయ జట్టులో చోటు సుస్థిరం చేసుకోలేకపోయిన ఐదుగురు అన్​లక్కీ క్రికెటర్ల గురించి తెలుసుకుందాం..

By

Published : Jul 16, 2020, 8:29 PM IST

unlucky cricketers in india
అన్​లక్కీ క్రికెటర్లలో ఓ ఐదుగురు భారతీయులు

భారత్​లో క్రికెట్​కు ఉన్న క్రేజ్​ అంతా ఇంతా కాదు. అందుకే జాతీయ జట్టులోకి రావాలంటే విపరీతమైన పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. కేవలం 11 నుంచి 15 స్థానాల కోసం వేల మంది తమ సత్తా నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తారు. అయితే కొందరు ఎంత బాగా ఆడినా అదృష్టం లేక అలానే కనుమరుగైపోతారు. అలాంటి ఓ ఐదుగురు అన్​లక్కీ క్రికెటర్లు వీరే..

కరుణ్​ నాయర్​...

మిడిలార్డర్​ బ్యాట్స్​మన్ అయిన కరుణ్​ నాయర్​.. టెస్టుల్లో ట్రిపుల్​ సెంచరీ చేశాడు. 2016లో ఇంగ్లాండ్​ జట్టుపై ఆ ఫీట్​ సాధించాడు. అయితే ఆ తర్వాత అతడు మూడు మ్యాచ్​ల్లో ఆడే అవకాశం మాత్రమే దక్కించుకున్నాడు.

కరుణ్​ నాయర్​

గాయం నుంచి కోలుకుని వచ్చిన అజింక్య రహానె ఒక కారణమైతే.. ఐదుగురు బౌలర్ల నిబంధన వల్ల నాయర్​ స్థానం గల్లంతైంది. ఫలితంగా టెస్టు జట్టులో చోటు కోల్పోయాడు. సుదీర్ఘ ఫార్మాట్​లో భారత్ తరపున ట్రిపుల్​ సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా రికార్డు.. ఇతడిని ఉన్నత స్థానానికి తీసుకెళ్లలేకపోయింది.

ఆ తర్వాత ఎంతో ప్రయత్నించినా పోటీ వల్ల అవకాశాలు రాలేదు. వచ్చిన ఛాన్స్​లను వినియోగించుకున్న హనుమ విహారీ జట్టులో చోటు పొందడం, నెం​.6 లో జడేజా ఫిక్స్​ అయిపోవడం వల్ల ఇక ఈ టాలెంటెడ్​ యంగ్​స్టర్​కు అవకాశాలు కరవయ్యాయి.

మనోజ్​ తివారీ...

2011లో విండీస్​-భారత్​ మధ్య జరిగిన వన్డేలో అద్భుతంగా పోరాడిన మనోజ్​ తివారీ.. ప్రత్యర్థి బౌలర్లను చెండాడుతూ సెంచరీతో కదం తొక్కాడు. ఫలితంగా ఆ మ్యాచ్​లో మ్యాన్​ ఆఫ్​ ద మ్యాచ్​ అందుకున్నాడు. అయితే మిడిలార్డర్​లో మెరుగైన ప్రదర్శన చేసే ఇతడికి ఆ మ్యాచ్​ తర్వాత 14 వన్డేల్లో అసలు అవకాశమే రాలేదు.

మనోజ్​ తివారీ

2012లో మళ్లీ అరకొర ఛాన్స్​ వస్తే.. నాలుగు వికెట్లతో అందులోనూ అద్భుత ప్రదర్శన చేశాడు. ఆ తర్వాత మళ్లీ 2015 వరకు అవకాశం రాలేదు. ఐపీఎల్​ వేలంలోనూ ఇతడిని అండర్​ రేటెడ్​గా పరిగణించారు. చాలా తక్కువ మొత్తానికే కోల్​కతా, రైజింగ్​ పుణె జట్లు కైవసం చేసుకున్నాయి. ప్రతిభ ఉన్న ఇతడికి ఐపీఎల్​ లాంటి టోర్నీలోనూ సరైన ధర పలకకపోవడం విచారకరం.

రాబిన్​ ఉతప్ప...

క్రికెట్​లోకి అరంగేట్రం చేశాక 2007 టీ20 వరల్డ్​కప్​లో ఆడాడు ఉతప్ప. అదే ఏడాది వన్డే ప్రపంచకప్​లోనూ బరిలోకి దిగాడు. దేశవాళీలో అద్భుతమైన ప్రదర్శన చేసినా.. ఆ తర్వాత ఇతడికి మళ్లీ భారత జట్టులో చోటు దక్కలేదు. కేకేఆర్​ తరఫున ఆడినప్పుడు కోచ్​ ప్రవీణ్​ ఆమ్రేతో గొడవ కారణంగా చోటు కోల్పోయాడు. ప్రస్తుతం 34 ఏళ్ల వయసున్న ఇతడు.. తొలుత కర్ణాటక కాకుండా సౌరాష్ట్ర తరఫున ఆడేవాడు. అనంతరం కేరళ తరఫున బరిలోకి దిగాడు. ఆశిష్​ నెహ్ర టీ20ల్లోకి రీఎంట్రీ ఇచ్చాక ఇతడికి అవకాశాలు వస్తాయని అందరూ భావించారు. ఐపీఎల్​లో రాణిస్తున్నా.. ఇప్పటికీ భారత జట్టులో మళ్లీ చోటు దక్కలేదు. ఈ ఏడాది రాజస్థాన్ రాయల్స్​ తరఫున ఆడనున్నాడు.

ఉతప్ప

పార్థివ్​ పటేల్​...

17 ఏళ్ల వయసులోనే క్రికెట్​లోకి అడుగుపెట్టిన పార్థివ్​.. ధోనీ, దినేశ్​ కార్తీక్​ కంటే ముందే అరంగేట్రం చేశాడు. ధోనీ రాకతో ఇతడి స్థానానికి గండి పడింది. దేశవాళీల్లో మంచి ఫామ్​ కనబరిచి.. 2016-17 రంజీ ట్రోఫీని తన రాష్ట్రం గుజారాత్​కు అందించడంలో కీలకపాత్ర పోషించాడు. ఓ మ్యాచ్​లో 143 పరుగులు చేసి మ్యాచ్​ను మలుపుతిప్పాడు. గతేడాది వృద్ధిమాన్​ సాహాకు గాయం వల్ల ఇంగ్లాండ్​ సిరీస్​లో ఇతడికి అవకాశమిచ్చారు. ఆ మ్యాచ్​లోనూ అర్ధశతకంతో రాణించాడు. అయితే మహీ కాలంలో క్రికెట్​లో అడుగుపెట్టడం తన దురదృష్టం కాదని.. అవకాశాలను ఒడిసిపట్టలేకపోయానని గతంలో ఆవేదన వ్యక్తం చేశాడు పార్థివ్. స్పెషలిస్ట్​ బ్యాట్స్​మన్​, కీపర్​గానూ నైపుణ్యం ఉన్న ఇతడికి జాతీయ జట్టులో ప్రస్తుతం అవకాశాలు గగనమైపోయాయి. ఐపీఎల్​లో మాత్రం మెరుపులు మెరిపిస్తుంటాడు.

పార్థివ్​ పటేల్​

పంకజ్​ సింగ్...

2014లో ఇంగ్లాండ్​ టూర్​కు వెళ్లిన భారత జట్టుకు అది మరచిపోలేని చెత్త సిరీస్​. ఓ మ్యాచ్​లో ఇషాంత్​కు గాయమవగా.. ఫస్ట్​క్లాస్​లో రాణించిన పంకజ్​కు అవకాశం వచ్చింది. ఆ మ్యాచ్​లో అద్భుతంగా బౌలింగ్​ చేసినా పంకజ్​ను దురదృష్టం వెంటాడింది. క్యాచ్​లు వదిలేయడం, అంపైర్​ తప్పుడు నిర్ణయాల వల్ల ఈ రాజస్థాన్​ పేసర్​ అరంగేట్ర మ్యాచ్​లో వికెట్లు తీయలేకపోయాడు. ఫలితంగా ఆ మ్యాచ్​ తర్వాత మళ్లీ యువ ఆటగాడికి అవకాశాలు రాలేదు.

పంకజ్

తన ప్రతిభతో 2018లో రంజీ ట్రోఫీలో వేగంగా 400 వికెట్లు తీసిన బౌలర్​గా ఘనత సాధించాడు. అయితే ఈ పేసర్​కు ఇప్పటివరకు భారత జట్టులో మళ్లీ సత్తా నిరూపించుకునే అవకాశం రాలేదు.

ABOUT THE AUTHOR

...view details