తెలంగాణ

telangana

ETV Bharat / sports

మహిళల బిగ్​బాష్ లీగ్​లో స్టన్నింగ్ క్యాచ్ - మహిళా బిగ్​బాష్ లీగ్ క్యాచ్

మహిళల బిగ్​బాష్​ లీగ్​లోని ఓ పోరులో బ్రిస్బేన్ హీట్స్​పై అడిలైడ్ స్ట్రైకర్స్ గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్​లో స్ట్రైకర్స్ ఆటగాళ్లు కలిసి పట్టిన క్యాచ్ నెటిజన్లను విపరీతంగా అలరిస్తోంది.

Tahlia McGrath completes epic catch in Women's Big Bash League
ఫీల్డర్స్ రాక్స్.. బ్యాట్స్​మన్ షాక్

By

Published : Nov 7, 2020, 4:13 PM IST

ఐపీఎల్​లో అద్భుత ఫీల్డింగ్ విన్యాసాల్ని చూశాం. బౌండరీల వద్ద గాల్లో ఎగిరి క్యాచ్​లు పట్టడాన్ని ఆస్వాదించాం. అయితే ఈ సన్నివేశాలు మహిళల టీ20 లీగ్​లో అంతగా కనిపించవు. కానీ ప్రస్తుతం జరుగుతున్న మహిళల బిగ్​బాష్​ లీగ్​లో ఓ క్యాచ్ నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. బ్రిస్బేన్ హీట్-అడిలైడ్ స్ట్రైకర్స్ మధ్య జరిగిన మ్యాచ్​లో ఈ అద్భుతం అవిష్కృతమైంది.​

ఏం జరిగింది?

అడిలైడ్ స్ట్రైకర్స్ స్పిన్నర్​ అమండా వేసిన ఫుల్ టాస్ బంతిని మిడ్ వికెట్ మీదుగా బౌండరీ కొట్టాలని చూసింది అమీలియా కేర్. కానీ బ్యాట్​కు బంతి అంతగా కనెక్ట్ అవ్వలేదు. ఆ బంతిని అందుకునేందుకు షార్ట్ మిడ్ వికెట్​లో ఉన్న మ్యాడీ పెన్నా గాల్లోకి డైవ్ చేసింది. కానీ చేతుల్లోకి జారిపోయింది. దీంతో ఆమె వెనకనే బంతి కోసం చూస్తున్న టహిలా మెక్​గ్రాత్ దానిని అందుకునేందుకు అమాంతం డైవ్ చేసింది. బంతి నేలపై పడుతుందనుకున్న క్రమంలో ఒడిసిపట్టుకుంది. దీంతో కేర్ పెవిలియర్ చేరింది. ఈ వీడియోను మహిళల బిగ్​బాష్ లీగ్​ ట్విట్టర్​ అకౌంట్​లో షేర్ చేయగా నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

ఈ మ్యాచ్​లో బ్రిస్బేన్ హీట్స్​పై అడిలైడ్ స్ట్రైకర్స్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. స్ట్రైకర్స్ బౌలర్ వెల్లింగ్టన్ మూడు ఓవర్లు వేసి 19 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడొగట్టింది. ​

ABOUT THE AUTHOR

...view details