తెలంగాణ

telangana

ETV Bharat / sports

ధోనీ ఫిట్​గా లేకపోతే.. టీ20 వరల్డ్​కప్​ కీపర్​గా రాహుల్​!

ఆస్ట్రేలియా వేదికగా వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్​లో కీపర్​ స్థానానికి మరో ఆటగాడు పోటీపడనున్నాడు. ఇప్పటికే సీనియర్​ క్రికెటర్​ ధోనీ, యువ కీపర్లు రిషబ్​ పంత్​, సంజు శాంసన్​ ఈ జాబితాలో ఉన్నారు. తాజాగా టీమిండియా టాపార్డర్​ బ్యాట్స్​మన్​ టీ20, వన్డే ఫార్మాట్​ ఓపెనర్​ కేఎల్​ రాహుల్​నూ ప్రయత్నిస్తామని పరోక్షంగా వెల్లడించాడు భారత జట్టు కోచ్​ రవిశాస్త్రి.

MS Dhoni if not fit, KL Rahul serious keeping option: Ravi Shastri
ధోనీ ఫిట్​గా లేకపోతే.. టీ20 వరల్డ్​కప్​ కీపర్​గా రాహుల్​!

By

Published : Dec 14, 2019, 10:22 PM IST

వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్​లో కీపర్​ స్థానానికి మహేంద్రసింగ్ ధోనీ సహా పంత్​, సంజు శాంసన్​ రేసులో ఉన్నారు. ఈ విషయంపై ఓ ఛానల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన భారత జట్టు ప్రధాన కోచ్​ రవిశాస్తి.. ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. టాపార్డర్​ బ్యాట్స్​మన్​ కేఎల్​ రాహుల్​నూ కీపర్​గా పరీక్షించే అవకాశముందని తెలిపాడు.

ధోనీ, రాహుల్​, పంత్​, సంజు శాంసన్​

" ధోనీ విరామం తీసుకోవడం మంచిదే. ఐపీఎల్‌ సమయానికి అతడు తిరిగి బ్యాట్ పట్టుకుంటాడు. వన్డేలపై అతడికి ఆసక్తి ఉందనుకోను. టెస్టు క్రికెట్‌కు ఎప్పుడో వీడ్కోలు పలికాడు. టీ20లే అతడికి అవకాశం. డిమాండ్​కు తగ్గట్టు అతడి శరీరం సహకరిస్తుందో లేదో మహీకే తెలుసు. విశ్రాంతి వల్ల శారీరకంగా, మానసికంగా మెరుగవుతారు. మానసిక అలసట మాయం అవుతుంది. ఆడాలని అతడు నిర్ణయించుకుంటే ఐపీఎల్‌ ఆడతాడు. ఆ తర్వాత టీమిండియాకు సన్నద్ధం అవుతాడు".
- రవిశాస్తి, టీమిండియా కోచ్​

టీమిండియాకు కేఎల్‌ రాహుల్‌ కీపింగ్‌ చేసే అవకాశాలను కొట్టిపారేయలేమని శాస్త్రి అన్నాడు. అవసరాలను బట్టి ఆటగాళ్లు ఒకేసారి భిన్న పాత్రాల్లో ఒదిగిపోవాల్సి ఉంటుందని తెలిపాడు. ఇప్పటికే రాహుల్​ ఐపీఎల్‌లో పంజాబ్‌, దేశవాళీలో కర్ణాటకకు కీపింగ్‌ చేస్తున్నాడు.

"క్రికెటర్లకు ఐపీఎల్​ మంచి అవకాశం. ఎవరి సామర్థ్యాలేంటో పరీక్షించుకొనే వేదిక ఇది. ఐపీఎల్‌లో అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడిన క్రికెటర్లు మిడిలార్డర్‌లో రాణించొచ్చు. ఒకేసారి విభిన్న పాత్రలు పోషించే వాళ్లు, టాపార్డర్‌లో ఉపయోగపడే ఆటగాళ్లకు అండగా నిలవాలి" అని రాహుల్‌ గురించి చెప్పాడు శాస్త్రి.

ధోనీ, రవిశాస్త్రి

పంత్​ను పంపేయాలి..?

కీపర్​గా రాణించాలంటే రిషబ్​ పంత్​ ప్రశాంతంగా ఉండాలని సూచించాడు రవిశాస్త్రి.

" పంత్‌ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. బ్యాటింగ్‌ ఎలా చేయాలన్నదానిపై స్పష్టత ఉండాలి. తొలి బంతి నుంచే సిక్సర్‌ బాదాలన్నట్టు ఉండొద్దు. ప్రతిసారీ అది పనిచేయదు. ఆట అన్నీ నేర్పిస్తుంది. పిచ్చితనానికీ ఓ పద్ధతుంది. అతడు దానిని నేర్చుకోవాలి. ప్రశాంతంగా ఉండాలి. తనను తాను మళ్లీ కనుగొనేందుకు దేశవాళీలు ఆడటంలో తప్పులేదు. ఆ స్థాయిలో ఒత్తిడి కాస్త తక్కువ ఉంటుంది. అతడిది చిన్నవయసు కావడం అదృష్టం" అని పంత్​ గురించి మాట్లాడాడు శాస్త్రి.

3-6 నెలలు దేశవాళీకి వెళ్లి మెరుగవ్వడంలో తప్పులేదని పంత్​ గురించి అభిప్రాయపడ్డాడు. అప్పుడు మరింత దృఢంగా తిరిగిరావొచ్చని చెప్పాడు. ప్రస్తుతం అతడికి కొంచెం సమయం ఇవ్వాలని చెప్పిన కోచ్​... ఐదేళ్ల తర్వాతా పంత్‌ రాణించకపోతే అప్పుడు అవకాశాలపై మాట్లాడాలని అన్నాడు.

ABOUT THE AUTHOR

...view details