తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ప్రపంచకప్​ను ఐసీసీ అంత సులువుగా వదులుకోదు' - 2020 icc t20 World Cup news

టీ20 ప్రపంచకప్​ను ఐసీసీ, వదులుకునేందుకు సిద్ధంగా లేదని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ అభిప్రాయపడ్డారు. జరిపేందుకు తన వంతు ప్రయత్నం చేస్తోందని తెలిపారు. అందుకే ఐపీఎల్​పై ఏ నిర్ణయం తీసుకోలేదని అన్నారు.

'ప్రపంచకప్​ను ఐసీసీ అంత సులువుగా వదులుకోదు'
టీ20 ప్రపంచకప్

By

Published : Jul 12, 2020, 1:39 PM IST

తమకు ఐపీఎల్​ ఎంత ముఖ్యమో, అంతర్జాతీయ క్రికెట్​ మండలికి టీ20 ప్రపంచకప్​ అంతే ముఖ్యమని చెప్పారు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ. ఈ టోర్నీని ఐసీసీ అంత సులువుగా వదులుకోదని, నిర్వహించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తుందని అన్నారు.

"టీ20 ప్రపంచకప్​ను జరిపేందుకు ఐసీసీ తీవ్రంగానే ప్రయత్నిస్తోంది. ఎందుకంటే దీనిని నిర్వహిస్తే వారికి చాలా ఆదాయం వస్తుంది. మాకు(బీసీసీఐ) ఐపీఎల్ ఎలానో.. ఐసీసీకి ప్రపంచకప్​ అలాంటిది. వారు అంతా సులువుగా ఈ టోర్నీని వదులుకోరని నా అభిప్రాయం. ఈ విషయంపై ఐసీసీ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాం"

-సౌరభ్ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు

బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ

టీ20 ప్రపంచకప్​పై స్పష్టత వచ్చిన తర్వాతే ఐపీఎల్​పై నిర్ణయం తీసుకోనుంది బీసీసీఐ. అయితే కరోనా నేపథ్యంలో టోర్నీని జరపలేమని ఇప్పటికే చెప్పింది క్రికెట్ ఆస్ట్రేలియా. కానీ దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ఐసీసీ. ఒకవేళ ప్రపంచకప్​ వాయిదా పడితే... అక్టోబరు-నవంబరు మధ్య కాలంలో లీగ్​ను జరపాలని భారత క్రికెట్​ బోర్డు భావిస్తోంది.

బీసీసీఐ ఐపీఎల్

దీంతో డిసెంబరులోని ఆస్ట్రేలియాలో టీమ్​ఇండియా పర్యటన గురించి గంగూలీ మాట్లాడారు. జట్టు కచ్చితంగా వెళ్తుందని అన్నారు. అయితే క్వారంటైన్ సమయాన్ని తగ్గిస్తే మంచిదని అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details