తెలంగాణ

telangana

ETV Bharat / sports

ముందు టీ20 సిరీస్ ఆడదాం: బీసీబీ - pak vs ban

పాకిస్థాన్​లో టెస్టు సిరీస్ ఆడాలన్న పీసీబీ అభ్యర్థనకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు విముఖత వ్యక్తం చేసింది. ముందుగా టీ20 సిరీస్​ ఆడతామని స్పష్టం చేసింది.

Bangladesh
బీసీబీ

By

Published : Dec 25, 2019, 1:04 PM IST

పాకిస్థాన్‌ పర్యటనలో టీ20లు ఆడతామని, టెస్టుల గురించి తర్వాత నిర్ణయం తీసుకుంటామని బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (బీసీబీ) తెలిపింది. "పాకిస్థాన్‌ తమ దేశంలో అంతర్జాతీయ క్రికెట్‌ను పూర్తిస్థాయిలో పునరుద్ధరించే ప్రయత్నంలో ఉంది. అయితే మా జట్టు యాజమాన్యంలో చాలా మంది విదేశీయులున్నారు. జట్టు సభ్యులు, సహాయ సిబ్బంది సూచనల ప్రకారం మేం నడుచుకుంటాం. మా ప్రాథమిక ప్రతిపాదన మేరకు ముందు టీ20లు ఆడతాం. ఆ తర్వాత పరిస్థితుల్ని బట్టి టెస్టులపై నిర్ణయం తీసుకుంటాం" అని బీసీబీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ నిజాముద్దీన్‌ చౌదురి తెలిపారు.

తమ దేశంలో రెండు టెస్టులు, మూడు టీ20లు ఆడాలని బంగ్లాదేశ్‌ను పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు అభ్యర్థించింది. అయితే టెస్టులపై స్పష్టమైన హామీ ఇవ్వని బంగ్లాదేశ్‌పై పాకిస్థాన్‌ సారథి అజార్‌ అలీ, ప్రధాన కోచ్‌ మిస్బా ఉల్‌ హక్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది అన్యాయమని, టెస్టులకు అభ్యంతరం చెప్పడానికి ఇక్కడ ప్రతికూలాంశాలు ఏమీ లేవని అన్నారు. పదేళ్ల తర్వాత స్వదేశంలో ఇటీవల శ్రీలంకతో పాక్‌ రెండు టెస్టుల సిరీస్‌ను ఆడింది. ఈ సిరీస్‌ను పాక్‌ 1-0తో కైవసం చేసుకుంది.

ఇవీ చూడండి.. 'ఐపీఎల్​ ద్వారా ఆసీస్ ఆటగాళ్లకు లాభమే​'

ABOUT THE AUTHOR

...view details