భారత లెఫ్టార్మ్ పేసర్ నటరాజన్ ఫిట్‌నెస్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో అన్ని ఫార్మాట్లలో అరంగేట్రం చేసి సత్తాచాటిన ఈ బౌలర్.. తర్వాత గాయం కారణంగా స్వదేశంలో ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో ఆడలేకపోయాడు. మళ్లీ టీ20 జట్టులో స్థానం దక్కించుకున్న అతడు.. నాలుగు మ్యాచ్‌లకూ దూరమయ్యాడు.
ఫిట్‌నెస్ పరీక్షల్లో నటరాజన్ సఫలం - ఫిట్‌నెస్ పరీక్షల్లో నటరాజన్ సఫలం
టీమ్ఇండియా పేసర్ నటరాజన్ ఫిట్‌నెస్ పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ ధ్రువీకరించింది.
నటరాజన్
అయితే తాజాగా ఫిట్‌నెస్ పరీక్షలో నెగ్గిన నటరాజన్ జట్టుతో చేరాడని బీసీసీఐ వెల్లడించింది. యోయో పరీక్షతో పాటు 2 కి.మీ పరుగు పరీక్షలోనూ అతడు నెగ్గినట్లు తెలిపింది.