ఆదివారం నుంచి ప్రారంభమైన దేశవాళీ టోర్నీ 'సయ్యద్ ముస్తాక్ అలీ' మ్యాచ్ నిర్వహణ రుసుమును పెంచింది బీసీసీఐ. రూ.2,50,000 నుంచి రూ.3,50,000 వరకు పెంచినట్లు బోర్డు తెలిపింది. టోర్నీలో ఆడే జట్లకు చెల్లించాల్సిన ఫీజును రూ.50వేలు నుంచి రూ.75వేలకు పెంచినట్లు వెల్లడించింది.
కరోనా నేపథ్యంలో రాష్ట్ర క్రికెట్ సంఘాలకు, పాల్గొనే జట్లకు ఆర్థికంగా అండగా నిలిచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు స్పష్టం చేసింది. రుసుములు పెంచుతూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయం హర్షనీయమైనదని బంగాల్ క్రికెట్ అసోసియేషన్ చెప్పింది.