స్వదేశంలో భారత్‌తో జరిగే టెస్టు సిరీస్ ఎంతో ప్రత్యేకమైందని ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్ తెలిపాడు. ఈ ఏడాది చివర్లో టీమ్ఇండియాతో ఆడే టెస్టు సిరీస్ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నాడు. భారత్ మెరుగైన జట్టు అని అన్నారు స్మిత్.
టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి గురించి మాట్లాడుతూ.. "మైదానం వెలుపల విరాట్‌తో మాట్లాడుతుంటా. ఈ మధ్య భారత్‌లో కరోనా పరిస్థితుల గురించి తెలుసుకున్నా. అతనో అద్భుతమైన వ్యక్తి. జట్టును గొప్పగా నడిపిస్తున్నాడు. నాలాగే మైదానంలో బాగా కష్టపడతాడు. 2019 వన్డే ప్రపంచకప్‌లో తనను, వార్నర్‌ను గేలి చేయొద్దని భారత అభిమానులను విరాట్ కోరడం మనసును హత్తుకుంది" అని స్మిత్ చెప్పాడు.