కరోనా అన్ని రంగాలపై ప్రభావం చూపినట్లే.. క్రికెట్లోనూ పలు మార్పులు తీసుకొచ్చింది. అయితే వైరస్ ప్రభావం ముగిసిన తర్వాత, బంతిని సలైవా(ఉమ్మి), చెమటతో రుద్దకూడదని వ్యాఖ్యలు వస్తున్న నేపథ్యంలో ఈ విషయమై స్పందించాడు భారత యువ క్రికెటర్ జయదేవ్ ఉనద్కత్. ఎర్ర బంతి మెరుపు కోసం ఆ రెండూ అవసరమని, తెల్లబంతి అవి అక్కర్లేదని అన్నాడు.
'తెల్ల బంతితో క్రికెట్‌కు ఆ రెండూ అవసరం లేదు' - జయదేవ్ ఉనద్కత్ వార్తలు
పరిమిత ఓవర్ల ఆటలోని తెల్ల బంతి మెరుపు కోసం చెమట, సలైవా ఉపయోగించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు బౌలర్ ఉనద్కత్.
జయదేవ్ ఉనద్కత్
"పరిమిత ఓవర్ల క్రికెట్లో బంతి మెరుపు అనే మాట రాదు. వన్డేల్లో 25 ఓవర్లకు ఓ బాల్ ఉపయోగిస్తుండటం వల్ల అలాంటి ఇబ్బంది తలెత్తకపోవచ్చు" -జయదేవ్ ఉనద్కత్, భారత క్రికెటర్
టీమిండియా తరఫున 7 వన్డేలు, 10 టీ20లు ఆడిన ఉనద్కత్.. ఐపీఎల్ గత సీజన్లో ఎక్కువ ధర పలికిన దేశీయ క్రికెటర్‌గా వార్తల్లో నిలిచాడు. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే కరోనా ప్రభావం తీవ్రమవుతుండటం వల్ల ఈ లీగ్‌ను నిరవధిక వాయిదా వేశారు.