ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ కోసం భారత వన్డే జట్టును శుక్రవారం ప్రకటించారు. అయితే జట్టులో తనకు చోటు దక్కడంపై యువ పేసర్ ప్రసిద్ధ్ క్రిష్ణ స్పందించాడు. టీమ్ఇండియాకు ఎంపిక కావడాన్ని అస్సలు నమ్మలేకపోతున్నానని చెప్పాడు. అరంగేట్ర మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు.
"జాతీయ జట్టులో స్థానం దక్కిందనే భావన నమ్మశక్యంగా లేదు. నా కల నెరవెరబోతోంది. టీమ్ఇండియా విజయానికి నా వంతు కృషి చేస్తాను. బీసీసీఐకి ధన్యవాదాలు. తొలి మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను"
-ప్రసిద్ధ్ క్రిష్ణ, యువపేసర్