ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో టీమ్ఇండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా బొటన వేలికి గాయమైన కారణంగా.. చివరి టెస్టు నుంచి తప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో జడేజాకు ఎడమచేతి బొటనవేలికి శస్త్రచికిత్స జరిగింది. ఈ విషయాన్ని సోషల్మీడియాలో వెల్లడించాడు.
"శస్త్రచికిత్స పూర్తయ్యింది. కొంతకాలం ఆటకు విరామం. మరింత బలంగా తిరిగొస్తా."