లాక్డౌన్ కారణంగా ఐపీఎల్‌ను వాయిదా వేసినా.. సోషల్‌మీడియా ద్వారా అభిమానులను అలరిస్తోంది చెన్నై సూపర్‌కింగ్స్ యాజమాన్యం. ఆ జట్టులోని ఆటగాళ్లను ఫేస్ యాప్ ద్వారా అమ్మాయిలుగా మార్చిన ఫొటోను బుధవారం సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. ఈ ఫొటోపై టీమ్ఇండియా బ్యాట్స్‌మన్ సురేష్ రైనాతో పాటు శార్దూల్ సోదరి కామెంట్లు చేశారు.
అతడితో కాఫీకి వెళతా: రైనా - CSK Share Hilarious Gender-Swap Photo
చెన్నై సూపర్‌కింగ్స్ పేసర్ శార్దూల్ ఠాకూర్‌తో కాఫీకి వెళ్లాలనుందని అంటున్నాడు టీమ్ఇండియా బ్యాట్స్‌మన్ సురేష్ రైనా. చెన్నై జట్టులోని ఆటగాళ్లను అమ్మాయిల రూపులోకి మార్చిన ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది ఆ జట్టు యాజమాన్యం. అందులో అమ్మాయి వేషంలో ఉన్న శార్దూల్‌తో కాఫీ తాగాలనుందని కామెంట్ చేశాడు రైనా.
చెన్నై సూపర్‌కింగ్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫొటోపై రైనా స్పందిస్తూ.."హా..హా...హా...నేనూ, శార్దూల్ ఠాకూర్ త్వరలోనే కాఫీకి వెళ్తాం" అని కామెంట్ చేశాడు. శార్దూల్ సోదరి మాలతి చాహర్ కామెంట్ చేస్తూ.."అమాయకమైన ముఖంతో.. ఎర్రని లిప్‌స్టిక్ వేసుకున్నాడు శార్దూల్ ఠాకూర్. కొంటె కళ్లు, పెద్ద పెదవుల కాంబినేషన్ చాలా బాగుంటుంది" అని వెల్లడించింది.
ఇటీవలే రోహిత్ శర్మను యువతిలా మార్చిన ఫొటోను షేర్ చేశాడు టీమ్ఇండియా స్పిన్నర్ చాహల్. రోహిత్ అమ్మాయిగా పుడితే ఎలా ఉంటుందనే ఆసక్తిని రేకెత్తించాడు. ట్విట్టర్లో అతడి ఫొటోను పంచుకున్న చాహల్.. పక్కనే అతడి మహిళా రూపాన్ని జతచేశాడు. దానికి "రోహితా శర్మ భయ్యా చాలా అందంగా ఉన్నావ్" అంటూ నవ్వుతున్న ఎమోజీలు జోడించాడు.