తెలంగాణ

telangana

By

Published : Jan 26, 2020, 3:17 PM IST

Updated : Feb 25, 2020, 4:34 PM IST

ETV Bharat / sports

'ధోనీ భవిష్యత్తు కోహ్లీ చేతుల్లో ఉంది'

భారత క్రికెట్ జట్టుకు ధోనీ సేవలు ఇంకా అవసరమున్నాయని, అయితే అతడు ఆడేది లేనిది కెప్టెన్​ కోహ్లీ చేతుల్లో ఉందన్నాడు సీనియర్ క్రికెటర్ రైనా. ఈ ఐపీఎల్​లో రాణించి టీ20 ప్రపంచకప్​ ఆడాలనుకుంటున్నట్లు చెప్పాడీ బ్యాట్స్​మన్.

'ధోనీ భవిష్యత్తు కోహ్లీ చేతుల్లో ఉంది'
ధోనీ కోహ్లీ

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సేవలు ఇంకా అవసరమని, అతడితో ఎలా ముందుకు వెళ్లాలన్నది ప్రస్తుత సారథి విరాట్‌ కోహ్లీ చేతుల్లో ఉందన్నాడు సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ సురేశ్‌ రైనా. రైనా, ధోనీ ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ఆడుతున్నారు. రానున్న ఐపీఎల్‌ సీజన్‌లో రాణించాలని చెన్నైలో రైనా, అంబటి రాయుడు ఇప్పటికే సాధన మొదలుపెట్టారు. మార్చి తొలి వారంలో ధోనీ, వారితో కలిసి ప్రాక్టీసు ప్రారంభించే అవకాశం ఉందని రైనా చెప్పాడు.

"ఐపీఎల్‌ కోసం సాధన చేసేందుకు ధోనీ.. మార్చి తొలి వారంలో చెన్నైకు రావచ్చు. ప్రస్తుతం అతడు కుటుంబంతో కలిసి సరదాగా గడుపుతున్నాడు. ధోనీ క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని భావిస్తే ఎలాంటి ఆర్భాటం లేకుండా వైదొలుగుతాడు. అయితే అతడు క్రికెట్‌ ఆడటాన్ని చూడాలనుకుంటున్నా. ఇప్పటికీ ధోనీ ఎంతో ఫిట్‌గా ఉన్నాడు. కఠోర సాధన చేస్తున్నాడు. టీమిండియాకు అతడి అవసరం ఉందని భావిస్తున్నా. అయితే అతడితో ఎలా ముందుకు వెళ్లాలన్నది విరాట్ చేతుల్లో ఉంది" -సురేశ్ రైనా, టీమిండియా క్రికెటర్

ఈ ఐపీఎల్‌ సీజన్‌లో రాణించి తిరిగి టీ20 ప్రపంచకప్‌ జట్టులో చోటు సంపాదించాలని రైనా భావిస్తున్నాడు.

టీమిండియా సీనియర్ క్రికెటర్ సురేశ్ రైనా

"ప్రస్తుతానికి అయితే ఎటువంటి లక్ష్యాన్ని పెట్టుకోలేదు. ఈ ఐపీఎల్‌లో సత్తాచాటాలని భావిస్తున్నా. ఇందులో రాణిస్తే టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ తరఫున ప్రాతినిథ్యం వహించడానికి అవకాశాలు ఉంటాయి. నా మోకాలు సహకరిస్తే ఐపీఎల్‌లో రాణిస్తా. ఇక రెండు నుంచి మూడేళ్ల వరకే నేను క్రికెట్‌ ఆడగలను. ఈ సమయంలో వరుసగా రెండు టీ20 ప్రపంచకప్‌లు జరగనున్నాయి. ఈ ఫార్మాట్​లో నేను అద్భుత ప్రదర్శన చేయగలను" -సురేశ్ రైనా, టీమిండియా క్రికెటర్

మార్చి నెలాఖరు నుంచి ఐపీఎల్​ మొదలు కానుంది. టీ20 ప్రపంచకప్​ ఆస్ట్రేలియాలో అక్టోబరులో జరగనుంది.

Last Updated : Feb 25, 2020, 4:34 PM IST

ABOUT THE AUTHOR

...view details