టీమ్ఇండియా మాజీ ఆటగాడు సురేశ్ రైనా కుడి చేతి మీద "నమ్మకం (బిలీవ్)" అనే పచ్చబొట్టు ఉంటుంది. దీన్ని అతను 2014లో వేయించుకున్నాడు. అయితే ఆ పచ్చబొట్టు వేసుకోవడానికి గల కారణాన్ని అతడు ఇటీవల బయటపెట్టాడు.
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ స్ఫూర్తితోనే అది వేయించుకున్నట్లు వెల్లడించాడు రైనా. 2013లోనే సచిన్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికినప్పటికీ.. ఆ తర్వాత అతనితో రైనా తన అనుబంధాన్ని కొనాసాగించాడు. 2017 ఇంగ్లాండ్ పర్యటనకు ముందు ముంబయిలోని సచిన్ నివాసానికి దగ్గర్లో అతని ఆధ్వర్యంలో శిక్షణ తీసుకున్నట్లు రైనా తెలిపాడు.