దాదాపు రెండు నెలల తర్వాత ఐపీఎల్లో ఆడకపోవడం గురించి మాజీ క్రికెటర్ సురేశ్ రైనా మాట్లాడాడు. గత సీజన్లో పాల్గొనందుకు తానేం బాధపడట్లేదని చెప్పాడు. ఆ సమయాన్ని పూర్తిగా కుటుంబంతో ఆస్వాదించానని అన్నాడు. చెన్నై సూపర్‌కింగ్స్‌తో యూఏఈకి వెళ్లిన రైనా.. వ్యక్తిగత కారణాలతో మ్యాచ్‌లు ప్రారంభం కాకముందే తిరిగి స్వదేశానికి వచ్చేశాడు.
"ఈ విషయంలో బాధపడాల్సింది ఏముంది. నా పిల్లలు, కుటుంబంతో ఆనందంగా సమయాన్ని ఆస్వాదించాను. పంజాబ్‌లో జరిగిన ఓ సంఘటన తర్వాత నా కుటుంబం నన్ను కావాలనుకుంది. అందుకోసమే స్వదేశానికి వచ్చేశాను. ఆట ఎప్పుడైనా ఆడొచ్చు. కానీ కుటుంబం అవసరం వచ్చినప్పుడు వాళ్లకు మనం కావాలి. అప్పుడు నేను సరైన పనే చేశాను" -సురేశ్ రైనా, టీమ్ఇండియా క్రికెటర్