తెలంగాణ

telangana

ETV Bharat / sports

'విదేశీ లీగుల్లోకి భారత క్రికెటర్లను అనుమతించాలి' - టీమిండియా క్రికెటర్లు విదేశీ టీ20 లీగ్​లు

జాతీయ జట్టులో చోటు దక్కని భారత క్రికెటర్లకూ, విదేశీ లీగ్​ల్లో ఆడే అవకాశం ఇవ్వాలని అన్నారు సురేనా రైనా-ఇర్ఫాన్ పఠాన్. ఈ విషయమై బీసీసీఐ పునరాలోచించుకోవాలని అభిప్రాయపడ్డారు.

'విదేశీ లీగ్​ల్లోకి భారత క్రికెటర్లను అనుమతించాలి'
రైనా ఇర్ఫాన్ పఠాన్

By

Published : May 10, 2020, 10:20 AM IST

Updated : May 10, 2020, 12:14 PM IST

30 ఏళ్లకు పైబడిన భారత క్రికెటర్లు విదేశీ లీగు​ల్లో ఆడేందుకు బీసీసీఐ అనుమతించాలని టీమిండియా సీనియర్ బ్యాట్స్​మన్ సురేశ్ రైనా అభిప్రాయపడ్డాడు. మాజీ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్​తో జరిగిన ఇన్​స్టా లైవ్​లో ఈ విషయమై చర్చించాడు. సదరు లీగుల్లో ఆడేందుకు ఆటగాళ్లను అనుమతించడంపై బోర్డు పునరాలోచించుకోవాలని పఠాన్ అన్నాడు.

"బీసీసీఐతో కాంట్రాక్ట్​ లేని క్రికెటర్లను విదేశీ టోర్నీల్లో ఆడేందుకు అనుమతించాలి. కనీసం రెండు లీగు​ల్లో అయినా ఆడే అవకాశం కల్పించాలి. వాటిలో పాల్గొనడం ద్వారా మా స్కిల్స్​ను మరింత పెంచుకోవచ్చు. అందులో బాగా ఆడితే జాతీయ జట్టులోనూ ఛాన్స్ రావొచ్చేమో" -రైనా, సీనియర్ క్రికెటర్

రైనా చెప్పిన విషయమై స్పందించిన ఇర్ఫాన్ పఠాన్.. 30 ఏళ్లు పైబడి, జాతీయ జట్టు అంచనాల పరిధిలో లేని క్రికెటర్లను విదేశీ లీగుల్లో ఆడేందుకు బీసీసీఐ అనుమతించాలని అన్నాడు.

భారత క్రికెట్ నియంత్రణ మండలి నిబంధనల ప్రకారం ఏ క్రికెటర్​ అయినా, అన్ని ఫార్మాట్లలో రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాతే​ విదేశీ లీగు​ల్లో ఆడొచ్చు. అప్పుడూ బోర్డు నుంచి నిరభ్యంతర పత్రం తీసుకోవాలి. అయితే జనవరిలో ఇర్ఫాన్ పఠాన్.. ఆటకు వీడ్కోలు పలకగా, 2018లో టీమిండియా తరఫున చివర అంతర్జాతీయ మ్యాచ్​ ఆడాడు రైనా.

Last Updated : May 10, 2020, 12:14 PM IST

ABOUT THE AUTHOR

...view details