వ్యక్తిగత కారణాలతో ఈ ఏడాది ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రౌండర్ సురేశ్ రైనా. దీంతో ఈ సారి ఆ జట్టుకు మూడో స్థానంలో ఎవరు బ్యాటింగ్ చేస్తారనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజాగా దీనిపై రైనానే స్పందించాడు. ఆ స్థానంలో మహేంద్ర సింగ్ ధోనీ ఆడితే బాగుంటుందని తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
"మూడో స్థానం చాలా ముఖ్యమైంది. ఈ స్థానంలో ధోనీ బ్యాటింగ్ చేస్తే సమతుల్యం లభిస్తుంది" అంటూ చెప్పుకొచ్చాడు రైనా.