తెలంగాణ

telangana

ETV Bharat / sports

'రీఎంట్రీలో రైనాకు అందుకే చోటు దక్కలేదు'

దేశవాళీల్లో విఫలం కావడం వల్లే రీఎంట్రీలో రైనా చోటు దక్కించుకోలేకపోయాడని మాజీ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ తెలిపాడు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాన్ని పంచుకున్నాడు.

'రీఎంట్రీలో రైనాకు అందుకే చోటు దక్కలేదు'
క్రికెటర్ సురేశ్ రైనా

By

Published : May 5, 2020, 6:47 PM IST

సీనియర్ బ్యాట్స్​మన్ సురేశ్ రైనా.. టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వకపోవడానికి గల కారణాన్ని వివరించాడు మాజీ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్. దేశవాళీల్లో అనుకున్నంత మేర పరుగులు చేయకపోవడమే, జాతీయ జట్టులో చోటు దక్కకపోవడానికి కారణమని అన్నాడు.

"జాతీయ జట్టుకు దూరమైన తర్వాత దేశవాళ్లీ రైనా ఏమంత బాగా రాణించలేదు. 2018-19 రంజీ సీజన్​లో అతడి ప్రదర్శన పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అదే ఏడాది ఐపీఎల్​లో మోస్తరుగా బ్యాటింగ్ చేశాడు. 1999లో వీవీఎస్ లక్ష్మణ్, టీమిండియాలో చోటు కోల్పోయినపుడు దేశవాళీల్లో అదరగొట్టి, తిరిగి జాతీయ జట్టులోకి వచ్చాడు. సీనియర్లు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి" -ఎమ్మెస్కే ప్రసాద్, టీమిండియా మాజీ ఛీప్ సెలక్టర్

టీమిండియా సీనియర్ క్రికెటర్ సురేశ్ రైనా

2018లో చివరగా ఇంగ్లాండ్​తో మ్యాచ్​లో ఆడిన రైనా.. ఆ తర్వాత మోకాలి గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. అనంతరం తనను ఎంపిక చేయకపోవడంపై సెలక్టర్లు, కనీస సమాచారం ఇవ్వలేదని ఇటీవలే ఆవేదన వ్యక్తం చేశాడు. 33 ఏళ్ల ఇతడు.. టీమిండియాకు 226 వన్డేలు, 78 టీ20లు, 18 టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించాడు. 2011 వన్డే ప్రపంచకప్​ గెలిచిన జట్టులో సభ్యుడిగానూ ఉన్నాడు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details