తెలంగాణ

telangana

ETV Bharat / sports

ద్రవిడ్​ ముందుచూపునకు ఆశ్చర్యపోయా: రైనా - suresh raina news

రాహుల్​ ద్రవిడ్​లోనూ మంచి కెప్టెన్​ ఉన్నాడని టీమ్​ఇండియా క్రికెటర్​ సురేశ్​ రైనా తెలిపాడు. ఆటను అర్థం చేసుకోవడంలో ద్రవిడ్​ చాలా చురుగ్గా ఆలోచిస్తాడని పేర్కొన్నాడు. అందుకు 2006లో పాకిస్థాన్​తో జరిగిన ఓ వన్డే మ్యాచ్​ను ఉదాహరణగా వివరించాడు.

SURESH RAINA ABOUT FORMER INDIAN CAMPTAIN RAHUL DRAVID
'ఆ రోజు ద్రవిడ్​ చెప్పినట్లే జరిగింది'

By

Published : Jun 28, 2020, 5:34 AM IST

భారత క్రికెట్‌లో గొప్ప సారథులంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు కపిల్‌దేవ్‌, గంగూలీ, ధోనీ, కోహ్లీలే. కానీ 2005 నుంచి 2007 వరకు నాయకత్వం వహించిన దిగ్గజ బ్యాట్స్‌మన్‌ రాహుల్‌ ద్రవిడ్‌ను ఎవరూ అంతగా గుర్తించరు. అతను కూడా సారథిగా టీమ్‌ఇండియాకు మంచి విజయాలు అందించాడు. కానీ, 2007 ప్రపంచకప్‌లో భారత్‌ ఘోర పరాభవం చెందడం వల్ల అతనికి దక్కాల్సిన గుర్తింపు దక్కలేదు. అయితే, ద్రవిడ్‌లోనూ మంచి సారథి ఉన్నాడని, ఆటను అర్థం చేసుకోవడంలో అతడు ఎలా ఆలోచిస్తాడో ఒక ఉదాహరణ చెప్పాడు క్రికెటర్‌ సురేశ్‌ రైనా. 2006లో పాకిస్థాన్‌తో జరిగిన ఒక వన్డేలో నాటి కెప్టెన్​గా ఉన్న ద్రవిడ్​.. తనను పాయింట్‌లో ఫీల్డింగ్‌ చేయమన్నాడని, అక్కడ సిద్ధంగా ఉంటే క్యాచ్‌ వస్తుందని చెప్పగా నిజంగా అలా జరిగిందని వివరించాడు.

"చిరకాల ప్రత్యర్థి పాక్‌తో జరిగిన ఆ మ్యాచ్‌ నాకింకా గుర్తుంది. అప్పుడు ద్రవిడ్‌ సారథిగా ఉన్నాడు. పఠాన్‌ బౌలింగ్‌ చేస్తున్నాడు. కమ్రన్‌ అక్మల్‌ క్రీజులో ఉన్నాడు. అప్పట్లో క్యాచ్‌లు అందుకునేందుకు 15 గజాలలోపు ఫీల్డర్లను పెట్టుకోవచ్చనే నియమం ఉండేది. దాంతో నన్ను పాయింట్‌లో ఉంటావా అని కెప్టెన్‌ అడిగాడు. నేను సరేనన్నా. అయితే, నన్ను నిలబెట్టిన చోట కాస్త ముందుకు వంగి, క్యాచ్‌ తీసుకోడానికి సిద్ధంగా ఉండమని ద్రవిడ్‌ చెప్పాడు. పఠాన్‌ వేసిన తర్వాతి బంతినే అక్మల్‌ షాట్‌ ఆడాడు. ఆ బంతి నేరుగా వచ్చి నా చేతుల్లో పడింది. అప్పుడు రాహుల్‌ భాయ్‌ క్యాచ్‌ వస్తుందని ముందే ఊహించడం నన్ను చాలా ఆకట్టుకుంది."

-సురేశ్​ రైనా, టీమ్​ఇండియా క్రికెటర్​

ఆ మ్యాచ్‌లో ఆర్పీసింగ్‌(4/40), ఇర్ఫాన్‌ పఠాన్‌(3/26) చెలరేగడం వల్ల.. పాక్‌ 161 పరుగులకే ఆలౌటైంది. అనంతరం టీమ్‌ఇండియా 32.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ద్రవిడ్‌ 59 కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడగా రైనా కూడా 32 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

ఇదీ చూడండి...'పంత్​ ఒక్కసారి పరుగులు చేయడం ప్రారంభిస్తే..!'

ABOUT THE AUTHOR

...view details