సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 198 పరుగుల భారీ స్కోర్ సాధించింది. టాస్ గెలిచిమొదటబ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ ప్రారంభంలోనే బట్లర్ వికెట్ కోల్పోయింది. శాంసన్‌తో కలిసి రహానే కుదురుగా ఆడుతూ పరుగులు రాబట్టారు. ఈ క్రమంలోనే ఇరువురు అర్ధశతకాలు సాధించారు.
స్కోర్ పెంచే క్రమంలో భారీ షాట్ ఆడబోయి 70 పరుగుల వ్యక్తిగత పరుగుల వద్ద రహానే అవుటయ్యాడు. దీంతో రెండో వికెట్‌కు 119 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. భుననేశ్వర్ వేసిన 18 ఓవర్లో శాంసన్ చెలరేగిపోయాడు. ఓ సిక్స్, నాలుగు ఫోర్లతో ఏకంగా 24 పరుగులు రాబట్టాడు.