వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో సంగీతాభిరుచి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మైదానంలో తన ఆటతో పాటు సందర్భానుసారంగా పాటలు రూపొందించి, అభిమానులను అలరిస్తుంటాడు. లాక్డౌన్ వేళ ఇంటికే పరిమితమైన ఈ ఆల్‌రౌండర్... నటి సన్నీ లియోనీతో ఇన్‌స్టా వేదికగా లైవ్ సెషన్లో పాల్గొన్నాడు.
సన్నీలియోనీతో స్టార్ క్రికెటర్ ఫన్నీ డ్యాన్స్ - sunny leone news
బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీ లియోనీతో ఇన్‌స్టా లైవ్‌లో పాల్గొన్న ఆల్‌రౌండర్ బ్రావో.. తను రూపొందించిన పాటకు డ్యాన్స్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
స్టార్ క్రికెటర్‌తో కలిసి సన్నీలియోనీ ఫన్నీ డ్యాన్స్
ఈ సందర్భంగా వీరిద్దరూ బ్రావో రూపొందించిన 'ఛాంపియన్' పాటకు స్టెప్పులేస్తూ కనిపించారు. దీనితో పాటే చాలా విషయాల గురించి సరదాగా మాట్లాడుకున్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
కరోనా కట్టడి కోసం ప్రజల్లో అవగాహన పెంచేందుకు సోషల్ మీడియా వేదికగా పలు జాగ్రత్తలు చెబుతున్నాడు బ్రావో. ఇటీవలే టీమిండియా మాజీ సారథి ధోనీపై ప్రశంసల జల్లు కురింపించిన ఇతడు.. మహీపై ఓ పాటను కంపోజ్ చేస్తున్నట్లు తెలిపాడు.