భారత క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా టీమిండియా మాజీ లెప్టార్మ్ స్పిన్నర్ సునీల్ జోషి ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని నేడు(బుధవారం) బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.
మాజీ క్రికెటర్లు మదన్‌లాల్, ఆర్పీ సింగ్, సులక్షన కులకర్ణి నేతృత్వంలోని బీసీసీఐ క్రికెట్ సలహా మండలి... సెలక్షన్ కమిటీ కొత్త ఛైర్మన్‌గా సునీల్ జోషి పేరును ఖరారు చేసింది. పదవీ కాలం ముగిసిన ప్రస్తుత సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎంఎస్కే ప్రసాద్ స్థానంలో జోషి బాధ్యతలు చేపడతాడు.
పదవీ కాలం ముగిసిన మరో సెలక్షన్ కమిటీ సభ్యుడు గగన్ ఖోడా స్థానంలో టీమిండియా మాజీ పేస్ బౌలర్ హర్విందర్ సింగ్ ఎంపికయ్యాడు.