ప్రపంచకప్‌లో వైఫల్యం చెందిన టీమిండియా ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనకు సిద్ధమవుతోంది. ఈ సిరీస్ కోసం సెలక్షన్ కమిటీ ఇప్పటికే జట్టును ఎంపికచేసింది. మూడు ఫార్మాట్లకూ కోహ్లీనే సారథిగా ప్రకటించింది. ఈ విషయంపై భారత మాజీ ఆటగాడు సునీల్ గావాస్కర్ మండిపడ్డాడు. వరల్డ్‌కప్‌లో వైఫల్యం తర్వాత అన్ని ఫార్మాట్లకూ కోహ్లీనే కెప్టెన్‌గా ఎలా కొనసాగిస్తారని ప్రశ్నించాడు.
"ప్రపంచకప్ ఓటమి తర్వాత కెప్టెన్సీ విషయంలో ఓ సమావేశం జరగాలి కదా. ఎలాంటి విచారణ లేకుండా కోహ్లీని ఎలా కెప్టెన్‌గా కొనసాగిస్తారు. దీనిని బట్టి సెలక్షన్ కమిటీ కోహ్లీ పట్ల సానుకూలంగా ఉన్నట్లుంది. మాకున్న అవగాహన ప్రకారం ప్రపంచకప్ వరకు కోహ్లీ కెప్టెన్‌గా కొనసాగాలి. అనంతరం సారథి ఎంపికపై సమావేశం జరగాలి".
-సునీల్ గావాస్కర్, టీమిండియా మాజీ ఆటగాడు