తెలంగాణ

telangana

ETV Bharat / sports

రోహిత్​తో మయాంక్ ఓపెనింగ్​.. మిడిల్​ఆర్డర్​కు గిల్ - భారత్, ఆస్ట్రేలియా 3వ టెస్టు

మెల్​బోర్న్​ టెస్టు విజయంతో ఆత్మస్థైర్యంతో ఉంది టీమ్​ఇండియా. ప్రస్తుత జట్టుతోనే మూడో టెస్టు ఆడాలని యాజమాన్యం భావిస్తున్నా.. రోహిత్​ శర్మ అందుబాటులో ఉండడం సెలక్షన్​ ప్రక్రియను క్లిష్టంగా మార్చింది. ఈ క్రమంలో ఎవరు ఓపెనింగ్​ చేయాలనేది వివరిస్తూ తన జట్టును ప్రకటించాడు మాజీ సారథి సునీల్ గావస్కర్.

Sunil Gavaskar picks his Team India openers for 3rd Test vs AUS
రోహిత్​తో మయాంక్ ఓపెనింగ్​.. మిడిల్​ఆర్డర్​కు గిల్

By

Published : Dec 31, 2020, 6:50 PM IST

కొత్త సంవత్సరంలో జరగబోయే సిడ్నీ టెస్టు కోసం తన జట్టును ప్రకటించాడు మాజీ ఓపెనర్​ సునీల్ గావస్కర్. రోహిత్​తో కలిసి మయాంక్​ అగర్వాల్​ ఓపెనింగ్​ చేయాలని చెప్పాడు. జనవరి 7న ఈ మ్యాచ్​ ప్రారంభంకానుంది.

"మయాంక్​ అగార్వల్​ జట్టులో కొనసాగుతాడు. ఇప్పటివరకు సంతృప్తికర ప్రదర్శన చేయనప్పటికీ, అతడు నాణ్యమైన ఆటగాడు. రోహిత్​తో కలిసి అతడు ఓపెనింగ్ చేయాలి. టాప్​ఆర్డర్​లో శుభ్​మన్​ గిల్​ బాగా ఆడుతున్నాడు. అయితే అతడు ఓపెనింగ్​లో​ అంతగా సఫలమవుతాడని నేను అనుకోవడం లేదు. 5వ స్థానం అతడికి సరిగ్గా సరిపోతుందని నా అభిప్రాయం. గిల్​ వస్తే విహారికి ఉద్వాసన తప్పదు. మిగిలిన జట్టు యథాతథంగా కొనసాగుతుంది."

-​ సునీల్ గావస్కర్, భారత మాజీ సారథి

తొలి టెస్టు ఘోర పరాభవం తర్వాత బాక్సింగ్​డే టెస్టు విజయంతో తిరిగి పుంజుకుంది టీమ్​ఇండియా. రెండో టెస్టు జట్టుతోనే కొనసాగాలని కెప్టెన్​ రహానె సహ యాజమాన్యం భావించింది. అయితే డాషింగ్​ ఓపెనర్ రోహిత్​ శర్మ అందుబాటులో ఉండడం, పేసర్ ఉమేశ్ యాదవ్​ గాయం కారణంగా వైదొలగడం, సెలక్షన్​ ప్రక్రియను క్లిష్టంగా మార్చింది.

ఇదీ చూడండి:భారత హాకీ దిగ్గజం మైఖేల్ కిండో కన్నుమూత

ABOUT THE AUTHOR

...view details