తెలంగాణ

telangana

ETV Bharat / sports

గావస్కర్​ పేరిట అరుదైన రికార్డు.. ఏంటంటే! - గావస్కర్ రికార్డు

టీమ్​ఇండియా బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గావస్కర్​ కొన్నిసార్లు బౌలింగ్ కూడా చేశాడు. అందులోనూ తన పేరిట ఓ రికార్డు కూడా ఉంది. అదేంటో తెలుసుకోవాలా. అయితే పూర్తి కథనం చదవాల్సిందే.

గావస్కర్​ పేరిట అరుదైన రికార్డు.. ఏంటంటే!
గావస్కర్​ పేరిట అరుదైన రికార్డు.. ఏంటంటే!

By

Published : Jul 21, 2020, 8:27 PM IST

బ్యాటింగ్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ తన మాస్టర్ క్లాస్ ఆటతీరుతో భారత జట్టులో కీలకపాత్ర పోషించాడు. తన బ్యాటింగ్‌తో ఎన్నో రికార్డులు నెలకొల్పిన అతడు టెస్టు క్రికెట్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. దశాబ్దం పాటు టీమ్​ఇండియాలో చెరగని ముద్ర వేసిన మాజీ సారథి పలు సందర్భాల్లో బౌలింగ్‌ కూడా చేశాడు. ఇప్పటివారికి ఆ విషయం అంతగా తెలియకపోవచ్చు. కానీ పాత తరం వారికి గుర్తుండే ఉంటుంది. సన్నీ తన బౌలింగ్‌తో అటు టెస్టుల్లో, ఇటు వన్డేల్లో కేవలం ఒక్కో వికెట్‌ మాత్రమే తీశాడు. అది కూడా పాకిస్థాన్‌ బ్యాట్స్‌మన్‌ జహీర్‌ అబ్బాస్‌నే రెండుసార్లు ఔట్‌ చేశాడు.

గావస్కర్‌ బౌలింగ్‌లో మరో విశేషం ఏంటంటే తను మీడియం పేస్‌తో పాటు ఆఫ్‌ స్పిన్‌ కూడా వేయగల సమర్థుడు. కుడిచేతితో బౌలింగ్‌ చేసే అతడు మొత్తం 29 ఇన్నింగ్స్‌ల్లో 380 బంతులేశాడు. తొలిసారి 1978-79 పాకిస్థాన్‌ పర్యటన సందర్భంగా బిషన్ ‌సింగ్‌ బేడీ కెప్టెన్సీలో బౌలింగ్‌ చేశాడు. టెస్టు మ్యాచ్‌లో జహీర్‌ అబ్బాస్‌ 96 పరుగుల వద్ద సన్నీ బౌలింగ్‌లో చేతన్‌ చౌహాన్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఇక వన్డేల్లోనూ ఇదే బ్యాట్స్‌మన్‌ మరోసారి సన్నీకి వికెట్‌ సమర్పించుకున్నాడు. గావస్కర్‌ మొత్తం 125 టెస్టులు ఆడగా 10,122 పరుగులు చేశాడు. అందులో 34 శతకాలు ఉన్నాయి. ఈ ఫార్మాట్‌లో పదివేల పరుగులు పూర్తి చేసిన తొలి క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు.

ABOUT THE AUTHOR

...view details