స్టార్ క్రికెటర్లు ధోనీ, రైనాలకు సైకత వీడ్కోలు - ధోనీ, రైనా సాండ్ఆర్ట్
మాజీ కెప్టెన్ ధోనీ, బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా.. అంతర్జాతీయ క్రికెట్‌కు శనివారం వీడ్కోలు పలికారు. ఆటలో వీరు చేసిన సేవలకుగానూ ఇసుకతో వారి బొమ్మలు రూపొందించి ఆకట్టుకున్నారు సైకతశిల్పి సుదర్శన్ పట్నాయక్.
![స్టార్ క్రికెటర్లు ధోనీ, రైనాలకు సైకత వీడ్కోలు Sudarshan Patnaik pays tribute to MS Dhoni, Suresh Raina with sand art](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8447201-104-8447201-1597644609466.jpg)
స్టార్ క్రికెటర్లు ధోనీ, రైనాలకు సైకత నివాళి
టీమ్ఇండియా క్రికెటర్లు మహేంద్రసింగ్ ధోనీ, సురేశ్ రైనా.. ఆగస్టు 15న అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలికారు. క్రికెట్లో వీరి సేవలకు మెచ్చుకుని, పూరి బీచ్‌లో సైకత శిల్పాలను నిర్మించారు సాండ్ ఆర్టిస్ట్ సుదర్శన్ పట్నాయక్. "మీ అద్భుతమైన షాట్లను మేం మిస్ అవుతున్నాం" అంటూ ఆ బొమ్మలపై రాశారు.
ధోనీ, రైనాల సైకత శిల్పాలు
Last Updated : Aug 17, 2020, 12:11 PM IST