వెస్టిండీస్‌తో జరగుతున్న నిర్ణయాత్మక చివరి టెస్టులో ఆస్ట్రేలియా స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ బ్యాటింగ్ శైలిని అనుకరించినట్లు చెప్పాడు ఇంగ్లాండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన బ్రాడ్.. కేవలం 33 బంతుల్లో అర్థశతకం చేశాడు. ఆపై 62 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఇంగ్లాండ్ కోచ్ మూర్స్ సలహా మేరకే వార్న్‌లా ఆడినట్లు బ్రాడ్ వెల్లడించాడు.
వార్న్ బ్యాటింగ్ శైలిని అనుకరించా: బ్రాడ్ - Stuart Broad
దిగ్గజ స్పిన్నర్ వార్న్ బ్యాటింగ్ శైలిని అనుకరించే అర్ధశతకం చేశానని అన్నాడు స్టువర్ట్ బ్రాడ్. మాంచెస్టర్‌లో విండీస్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఈ సంఘటన చోటుచేసుకుంది.
![వార్న్ బ్యాటింగ్ శైలిని అనుకరించా: బ్రాడ్ Stuart Broad reveals his batting inspiration after hitting 3rd joint-fastest fifty for England](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8176938-581-8176938-1595746741059.jpg)
షేన్ వార్న్ బ్యాటింగ్ శైలీని అనుకరించా: స్టువర్ట్ బ్రాడ్
"వ్యూహాత్మకంగా ఇది సరైనది. పీటర్ మూర్స్, వార్న్ బ్యాటింగ్ శైలిని నాకు గుర్తుచేశాడు. 2005లోని యాషెస్ సిరీస్‌లోని బ్యాటింగ్‌లో వార్న్.. భిన్నమైన షాట్లు కొట్టడం సహా బంతులను అవలీలగా ఎదుర్కొన్నాడు. ఫీల్డింగ్ లేని ప్రదేశాలను ఎంచుకుని అటువైపు బంతిని తరలించాడు. అదే తరహానే నేను ఆడాను"
-స్టువర్ట్ బ్రాడ్, ఇంగ్లాండ్ సీనియర్ బౌలర్
Last Updated : Jul 26, 2020, 3:49 PM IST