తెలంగాణ

telangana

ETV Bharat / sports

బౌలర్ బ్రాడ్​కు భారీ​ జరిమానా - స్టువర్ట్‌ బ్రాడ్

పాకిస్థాన్​తో తొలి టెస్టులో మితిమీరి ప్రవర్తించిన బౌలర్ బ్రాడ్​కు ఫీజులో 15 శాతం కోత విధించారు. ఈ మ్యాచ్​లో 3 వికెట్ల తేడాతో గెలిచి బోణీ కొట్టింది ఇంగ్లాండ్.

Stuart Broad
స్టువర్ట్‌ బ్రాడ్

By

Published : Aug 12, 2020, 8:11 AM IST

ఇంగ్లాండ్‌ ఫాస్ట్‌బౌలర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌కు భారీ జరిమానా విధించారు. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్‌ స్పిన్నర్‌ యాసిర్‌ షాను ఔట్‌ చేసిన తర్వాత అభ్యంతరకర భాష ఉపయోగించినందుకు, అతడి మ్యాచ్‌ ఫీజులో 15 శాతం కోత విధించారు మ్యాచ్‌ రిఫరీ క్రిస్‌ బ్రాడ్‌.

స్టువర్ట్‌ బ్రాడ్

స్టువర్ట్‌ బ్రాడ్‌ తండ్రే క్రిస్‌ బ్రాడ్‌. "స్టువర్ట్‌ బ్రాడ్‌ తన తప్పును ఒప్పుకున్నాడు. రిఫరీ ప్రతిపాదించిన శిక్షను అంగీకరించాడు". అని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. జరిమానాతో పాటు బ్రాడ్‌ క్రమశిక్షణ రికార్డులో ఓ అయోగ్యత పాయింట్ కూడా చేరింది.

ABOUT THE AUTHOR

...view details