తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్ వేలం: విదేశీ ఫినిషర్​ కోసం దిల్లీ ఫోకస్​..!

ట్రేడింగ్ విండో ద్వారా రహానే, అశ్విన్​లను కొనుగోలు చేసి బలంగా ఉంది దిల్లీ క్యాపిటల్స్. ప్రస్తుతం రూ.27.85 కోట్లు పర్సులో ఉంచుకున్న దిల్లీ.. విదేశీ ఫినిషర్​ కోసం చూస్తోంది.

Strategy of Delhi Capitals In IPL Auction
దిల్లీ క్యాపిటల్స్

By

Published : Dec 18, 2019, 11:25 AM IST

డిసెంబరు 19న జరగనున్న ఐపీఎల్ వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు అన్ని ఫ్రాంఛైజీలు తమ తమ వ్యూహాలకు పదును పెట్టాయి. స్వదేశీ ఆటగాళ్లతో బలంగా ఉన్న దిల్లీ క్యాపిటల్స్.. మంచి విదేశీ ఫినిషర్ కోసం చూస్తోంది.

అంటిపెట్టుకున్న ఆటగాళ్లు

శ్రేయస్ అయ్యర్ (సారథి), పృథ్వీ షా, శిఖర్ ధావన్, రిషభ్ పంత్, ఇషాంత్ శర్మ, అమిత్ మిశ్రా, ఆవేశ్ ఖాన్, సందీప్ లమిచానే, కగిసో రబాడ, కీమో పాల్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్

ట్రేడెడ్ ఇన్ (ట్రేడింగ్ విండో పద్ధతి ద్వారా కొనుగోలు చేసిన ఆటగాళ్లు) : రవిచంద్రన్ అశ్విన్ (పంజాబ్ నుంచి), అజింక్య రహానే (రాజస్థాన్ నుంచి), మయాంక్ మర్కాండే (ముంబయి నుంచి)

వదులుకున్న ఆటగాళ్లు

క్రిస్ మోరిస్, కొలిన్ ఇన్​గ్రామ్, బి. అయ్యప్ప, హనుమ విహారి, జలజ్ సక్సేనా, మన్​జోత్ కల్రా, నాథు సింగ్, అంకుశ్ బైన్స్, కొనిల్ మున్రో

ట్రేడెడ్ ఔట్ (ట్రేడంగ్ విండో పద్ధతి ద్వారా వదులుకున్న ఆటగాళ్లు) :ట్రెంట్ బౌల్ట్ (ముంబయికు), షెర్ఫానే రూథర్​ఫర్డ్ (ముంబయికు), జగదీశ సుచిత్ (పంజాబ్​కు), రాహుల్ తెవాటియా (రాజస్థాన్​కు), మయాంక్ మార్కాండే (రాజస్థాన్​కు)

అందుబాటులో ఉన్న నగదు: రూ. 27.85 కోట్లు

తీసుకునే అవకాశం ఉన్న క్రికెటర్ల సంఖ్య: 11 (స్వదేశీ 6, విదేశీ 5)

వ్యూహం..

దిల్లీ క్యాపిటల్స్ స్వదేశీ క్రికెటర్లతో బలంగా కనిపిస్తోంది. ట్రేడింగ్ విండో ద్వారా రహానే, అశ్విన్​లను కొనుగోలు చేసి ఆ బలాన్ని మరింత పెంచుకుంది. టాపార్డర్​లో స్వదేశీ ఆటగాళ్లు ఉన్నా, ఓ విదేశీ ఫినిషర్​ కోసం చూస్తోందీ జట్టు. క్రిస్ మోరిస్, ట్రెంట్ బౌల్ట్​ను వదులుకోవడం ద్వారా ఇప్పుడు విదేశీ ఫాస్ట్ బౌలింగ్ ఆల్​రౌండర్​ కోసం ప్రయత్నించవచ్చు. తమకున్న నగదుతో భారీ మొత్తంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆటగాళ్లను కొనుగోలు చేసే అవకాశం ఉంది.

దృష్టిసారించే ఆటగాళ్లు..

జేమ్స్ నీషమ్, గ్లెన్ మాక్స్​వెల్, హెట్మయర్, ఇయాన్ మోర్గాన్, జేపీ డుమిని, క్రిస్ వోక్స్, మార్కస్ స్టొయినిస్, కమిన్స్, షెల్డన్ కాట్రెల్, జేమ్స్​ పాటిన్సన్, మిచెల్ మార్ష్, బెన్ కటింగ్, లారీ ఇవాన్స్, మనోజ్ తివారి, ధ్రువ్ షోరే, లక్మన్ మరివలా.

ఇదీ చదవండి: ఐపీఎల్ వేలం: చెన్నై మొగ్గు యువకుల వైపేనా..!

ABOUT THE AUTHOR

...view details