ఐపీఎల్-2020 వేలం.. ఈ నెల 19న కోల్కతాలో జరగనుంది. అన్ని జట్లు ఇప్పటికే తమ ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నాయి. ఏ క్రికెటర్ ఎంత ధర పలుకుతాడో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భంగా చెన్నై సూపర్ కింగ్ జట్టు ఎలాంటి ఆటగాళ్ల వైపు మొగ్గుచూపుతుందో.. చెన్నై వ్యూహమేంటో ఇప్పుడు చూద్దాం.
అంటిపెట్టుకున్న ఆటగాళ్లు
మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్), సురేశ్ రైనా, డుప్లెసిస్, అంబటి రాయుడు, మురళీ విజయ్, రుతురాజ్ గైక్వాడ్, షేన్ వాట్సన్, డ్వేన్ బ్రావో, కేదార్ జాదవ్, లుంగి ఎంగిడి, రవీంద్ర జడేజా, మిచెల్ సాంట్నర్, మను కుమార్, జగదీషన్, హర్భజన్ సింగ్, కరణ్ శర్మ, ఇమ్రాన్ తాహిర్, దీపక్ చాహర్, కేఎమ్ ఆసిఫ్
వదులుకున్న ఆటగాళ్లు
మోహిత్ శర్మ, సామ్ బిల్లింగ్స్, డేవిడ్ విల్లే, స్కాట్ కుగెలెజ్, ధ్రువ్ శోరే, చైతన్య బిష్నోయ్
అందుబాటులో ఉన్న నగదు :రూ.14.60 కోట్లు