లాక్‌డౌన్ కారణంగా మారుమూల గ్రామంలో ఉండిపోయిన ఐసీసీ అంతర్జాతీయ ప్యానెల్ అంపైర్ అనిల్ చౌదరి.. ఫోన్ సిగ్నల్ కోసం చాలా కష్టాలు పడుతున్నారట. గత నెల 16న ఉత్తర్‌ప్రదేశ్‌లోని షమిల్ జిల్లాలోని తన పూర్వీకుల గ్రామం దాంగ్రోల్‌కు వచ్చానని, లాక్‌డౌన్‌తో ఇక్కడే ఉండాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. అయితే ఐసీసీ, అంపైర్స్‌కు ఆన్‌లైన్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తోందని, వాటికి హాజరు కావడం కోసం సిగ్నల్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నానని ఓ వార్తా సంస్థకు తన కష్టాలను చెప్పుకొచ్చారు.
సిగ్నల్ కోసం చెట్లు ఎక్కుతున్న ప్రముఖ అంపైర్ - క్రికెట్ వార్తలు
లాక్‌డౌన్ వేళ మారుమూల పల్లెలో చిక్కుకుని కష్టాలు పడుతున్నారు ఐసీసీ ప్యానెల్ అంపైర్ అనిల్ చౌదరి. నెట్ సిగ్నల్ కోసం చెట్టెక్కాల్సి వస్తుందని చెప్పారు.
"వారం రోజుల పాటు ఉండాలని నా ఇద్దరి కూమారులతో ఇక్కడికి వచ్చాను. అయితే దేశమంతా లాక్‌డౌన్ ప్రకటించడం వల్ల ఇక్కడే ఉండాల్సి వచ్చింది. మా అమ్మ, భార్య దిల్లీలో ఉండిపోయారు. అయితే ఇక్కడ అతి పెద్ద సమస్య మొబైల్ నెట్‌వర్క్. ఫోన్‌లో ఎవరితోనూ మాట్లాడలేని పరిస్థితి. ఇంటర్నెట్ రాదు. దాని కోసం ఊరి నుంచి బయటకు వెళ్లాలి. లేదా చెట్లు, ఇంటి పైకి ఎక్కాలి. అలా చేసినా అన్ని సందర్భాల్లోనూ సిగ్నల్ ఉండట్లేదు. ఐసీసీ నిర్వహిస్తున్న ఆన్‌లైన్ ప్రోగ్రామ్స్‌కు, నా కుమారుడు ఆన్‌లైన్ తరగతులకు ఇంటర్నెట్ అవసరం. దిల్లీ నుంచి 85 కి.మీ దూరంలో ఉన్నా ఈ సమస్య ఉంది. గతేడాది నుంచి ఈ సమస్య ఉంటుంది. ఈ విషయంపై జిల్లా ఉన్నతాధికారికి ఫిర్యాదు చేశాం. 10 రోజుల దాటినా అక్కడి నుంచి ఎటువంటి సమాధానమూ లేదు" -అనిల్ చౌదరి, ఐసీసీ అంపైర్
ఇక్కడి గ్రామస్థులందరికీ కరోనా వైరస్‌పై అవగాహన కల్పిస్తున్నాని, సామాజిక దూరం పాటించాలని సూచిస్తున్నాని అనిల్ చెప్పారు.