తెలంగాణ

telangana

ETV Bharat / sports

అభిమానిని తిట్టి, ఆపై క్షమాపణలు చెప్పిన స్టోక్స్ - ఇంగ్లాండ్ దక్షిణాప్రికా టెస్ట్

దక్షిణాఫ్రికాతో నాలుగో టెస్టులో ఇంగ్లాండ్ క్రికెటర్ బెన్​ స్టోక్స్​పై విమర్శలు చేశాడు ఓ అభిమాని. బదులుగా అతడిని దుర్భాషలాడాడు స్టోక్స్. తాజాగా ఈ సంఘటనపై క్షమాపణ చెప్పాడీ ఆల్​రౌండర్.

Stokes
Stokes

By

Published : Jan 25, 2020, 10:48 AM IST

Updated : Feb 18, 2020, 8:23 AM IST

ఇంగ్లాండ్ స్టార్ ఆల్​రౌండర్ బెన్ స్టోక్స్.. ఓ అభిమానికి క్షమాపణ చెప్పాడు. దక్షిణాఫ్రికాతో నాలుగో టెస్టులో స్టోక్స్ ఔటై, డగౌట్​కు వస్తున్న క్రమంలో అతడిని విమర్శించాడు ఓ అభిమాని. బదులుగా అతడిపై స్టోక్స్​ దుర్భాషలాడాడు. ఇవన్నీ మైక్​లో రికార్డు అయ్యాయి. వెంటనే ఈ వీడియోలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. తాజాగా ఈ విషయంపై స్పందించిన స్టోక్స్.. ఆ అభిమానికి క్షమాపణలు చెప్పాడు.

"నేను చేసిన వ్యాఖ్యల పట్ల క్షమాపణ చెబుతున్నా. అలా అనకుండా ఉండాల్సింది. నా చర్య క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ఉంది."
-స్టోక్స్, ఇంగ్లాండ్ క్రికెటర్

ఏం జరిగింది?

దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న నాలుగో టెస్టు తొలి రోజు స్టోక్స్.. రెండు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. అనంతరం పెవిలియన్​కు వెళుతున్న సమయంలో ఓ అభిమాని స్టోక్స్​ను విమర్శించాడు. పాప్ స్టార్ ఎడ్ షరీన్​తో పోలుస్తూ వ్యాఖ్యలు చేశాడు. దీనికి స్టోక్స్ ఆ అభిమానిపై మండిపడ్డాడు. దుర్భాషలాడాడు.

ఇవీ చూడండి.. 'కోహ్లీ, రోహిత్​లను చూసి నేర్చుకున్నా'

Last Updated : Feb 18, 2020, 8:23 AM IST

ABOUT THE AUTHOR

...view details