ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్, రిజర్వ్ ఓపెనర్ రోరీ బర్న్స్, పేసర్ జోఫ్రా ఆర్చర్లు చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ప్రాక్టీస్ మొదలుపెట్టారు. సహచర జట్టు సభ్యుల కంటే ముందుగా భారత్ చేరుకున్న ఈ ముగ్గురు ఆటగాళ్లు.. ఆరు రోజుల క్వారంటైన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. రెండో విడత నిర్వహించిన కొవిడ్ టెస్టులోనూ ఇంగ్లాండ్ ఆటగాళ్లందరికీ నెగెటివ్ రిపోర్టు వచ్చింది.
శ్రీలంక పర్యటనకు ఈ ముగ్గురు ఆటగాళ్లు అందుబాటులో లేరు. స్టోక్స్, ఆర్చర్లకు విశ్రాంతినిచ్చిన జట్టు యాజమాన్యం.. ఇటీవలే జన్మించిన తన పాపను చూడటానికి బర్న్స్‌ను పక్కన పెట్టింది. ఈ ముగ్గురికి ఇప్పటికే మూడు సార్లు ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహించారు అధికారులు. అయితే మిగతా జట్టు సభ్యులకు ఫిబ్రవరి 2 నుంచి మైదానంలోకి అనుమతించనున్నారు.
" మొదటి విడతలో భారత్‌కు వచ్చిన ఆర్చర్, స్టోక్స్, బర్న్స్‌లు.. శనివారం నుంచి మూడు రోజుల పాటు, రోజు రెండు గంటల చొప్పున ప్రాక్టీస్‌లో పాల్గొంటారు. రెండో విడత ఇంగ్లాండ్ జట్టుకు చేసిన కరోనా పరీక్షల్లోనూ అందరికీ నెగెటివ్ రిపోర్టు వచ్చింది."